మేడపై నుంచి 14 రోజుల బిడ్డను కిందకు పడేసిన తల్లి..కనీసం కడుపు తీపి లేకుండా..?
మనుషులు మరీ కఠినంగా తయారవుతున్నారు. క్షణికావేశంలో విచక్షణను కోల్పోతున్నారు. ఎమోషన్స్‌కి, రిలేషన్స్‌కి కనీసం విలువ ఇవ్వడం లేదు.

మనుషులు మరీ కఠినంగా తయారవుతున్నారు. క్షణికావేశంలో విచక్షణను కోల్పోతున్నారు. ఎమోషన్స్‌కి, రిలేషన్స్‌కి కనీసం విలువ ఇవ్వడం లేదు. తాజాగా భర్తమీద కోపంతో ఓ తల్లి కన్న పేగు బంధాన్ని కూడా మర్చిపోయి విపరీతంగా ప్రవర్తించింది. తన 14రోజుల వయసున్న పసిబిడ్డను కనీసం మానవత్వం లేకుండా బిల్డింగ్ నుంచి కిందకు పడేసింది. ఈ ఘటన సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌కు చెందిన వేణుగోపాల్, ఫతేనగర్‌కు చెందిన లావణ్యలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల తనయుడు ఉన్నాడు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలో..ఇటీవలి కాలంలో కలహాలు మొదలయ్యాయి. రెండోసారి గర్భం దాల్చిన లావణ్య ఫతేనగర్‌లోని తన తల్లిగారి ఇంటికి వచ్చింది. భర్తతో విబేధాల నేపథ్యంలో గత నెల 29వ తేదీన పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. తల్లిదండ్రులు బాధితురాలిని వెంటనే సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీసుకెళ్లడంతో..బిడ్డకు, తల్లికి ప్రాణాపాయం తప్పింది. డాక్టర్లు సిజేరియన్ చేసి కడుపులోని బిడ్డను బయటకు తీశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి లావణ్య తన అమ్మానాన్నల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం తను నివాసం ఉంటున్న బిల్డింగ్ మూడో అంతస్తు పైనుంచి తన 14రోజుల పసికందును కిందకు పడేసింది. దీంతో చిన్నారి స్పాట్‌లోనే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లావణ్యపై కేసు నమోదు చేసి..లావణ్యను అరెస్ట్ చేశారు.
Also Read :
అక్రమ సంబంధం : భర్తను వదిలేసింది, నాలుగేళ్ల కుమారుడిని చంపేసింది
హైదరాబాద్‌లో పండుగ పూట రెచ్చిపోయిన దొంగలు..రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లను దోచేశారు