అమావాస్యరోజే శనిసంచారం..ఈ రాశులవారికి ఊహించని ఫలితాలు!

samatha 

29 march 2025

Credit: Instagram

జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల్లోకెల్లా శని గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహం ఒకరాశి నుంచి మరొక రాశిలోకి వెళ్లడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. 

కాగా, నేడు మార్చి29న శని గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ఫలితాలు ఉండబోతున్నాయి.

శని అమావాస్య రోజే శని సంచారం, అదే విధంగా సూర్య గ్రహణం కావడంతో దీని ప్రభావం 12 రాశులపై పడనుంది. ఎందుకంటే  సుమారు 30 ఏళ్ల తర్వాత అమావాస్య రోజు వని సంచారం జరుగుతుంది.

కాగా, దీని ప్రభావం ఏ రాశులపై అధికంగా ఉంటుంది. వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

తుల రాశి : అమావాస్య రోజే శని సంచారం వలన వీరికి అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం వీరిసొంతం అవుతుంది.ఆర్థికంగా బాగుటుంది.

మకర రాశి : ఈ రాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరనం ఏర్పడుతుంది. ధనలాభం కలుగుతుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి శనిసంచారంతో  ఆర్థికంగా కలిసి వస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.

కన్యారాశి : ఈ రాశి వారు ఏ పని చేపట్టినా, అందులో విజయం వీరి సొంతం అవుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.ఆదాయం బాగుంటుంది.