దంచికొడుతున్న ఎండలు.. వేడితాపం తాళలేక చెరుకు రసం తాగుతున్నారా?

samatha 

28 march 2025

Credit: Instagram

వేసవి మొదలైపోయింది. మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలా మంది బయటకు రావడానికి జంకుతున్నారు.

ఇక ఈ ఎండాకాలంలో చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, చెరుకు రసం తాగుతుంటారు.

కొంతమంది మాత్రం అస్సలే చెరుకు రసం తాడానికి ఇష్టం చూపరు. కానీ వేసవికాలంలో కనీసం వారానికి రెండు సార్లైనా చెరుకు రసం తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట.

చెరుకు రసం తాగడం వలన వేడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా, జీర్ణక్రియ కూడా మెరుగు పడుతుందంట. అలాగే అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది.

వారానికి రెండు సార్లు తప్పకుండా చెరుకు రసం తాడం వలన పచ్చకామెర్ల వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే దీనిలో ఉండే అనేక పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.

చెరుగురంలో విటమిన్ బీ ఉండటం వలన ఇది మీ శరీరానికి టానిక్‌లా పని చేస్తుంది. వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గొంతు సమస్యలతో బాధపడే వారు చెరుకు రసంలో కాస్త అల్లం కలిపి తాగడం వలన గొంతు గరగర నుంచి ఉపశమనం పొందుతారు. తలనొప్పి కూడా తగ్గుతుంది.