AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థులకు షాక్.. 75% హాజరు ఉంటేనే ఎగ్జామ్స్‌కు అర్హులు!

10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలు రాయడానికి అర్హత సాధించాలంటే 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే బోర్డుకు అనుసంధానంగా ఉన్న అన్ని స్కూళ్లు జనవరి 1 వరకు నమోదైన విద్యార్థుల హాజరును లెక్కించనున్నాయి. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాజరు తగ్గడానికి సరైన కారణాలు ఉంటే సంబంధిత పత్రాలను జనవరి 7లోగా […]

విద్యార్థులకు షాక్.. 75% హాజరు ఉంటేనే ఎగ్జామ్స్‌కు అర్హులు!
CBSE Syllabus
Ravi Kiran
|

Updated on: Jan 03, 2020 | 6:23 AM

Share

10వ తరగతి, ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు సీబీఎస్ఈ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సంవత్సరం వార్షిక పరీక్షలు రాయడానికి అర్హత సాధించాలంటే 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే బోర్డుకు అనుసంధానంగా ఉన్న అన్ని స్కూళ్లు జనవరి 1 వరకు నమోదైన విద్యార్థుల హాజరును లెక్కించనున్నాయి. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో హాజరు తగ్గడానికి సరైన కారణాలు ఉంటే సంబంధిత పత్రాలను జనవరి 7లోగా ప్రాంతీయ కార్యాలయాల్లో సమర్పించాలని సీబీఎస్ఈ బోర్డు ఆదేశించింది.

అయితే ఈ నిబంధనను అమలు చేయడానికి కూడా కారణం లేకపోలేదట. 2019లో ఆయా తరగతుల ఫలితాలను పరీశీలించగా.. తక్కువ హాజరు కలిగిన వారందరూ పరీక్షల్లో ఫెయిల్, లీస్ట్ స్కోర్ తెచ్చుకున్నట్లు గణాంకాలు నమోదయ్యాయని తెలుస్తోంది. అందుకే దీనిని సరిదిద్దడానికి అన్ని స్కూళ్లు ఖచ్చితంగా 75% హాజరు ఉన్న విధ్యార్థులనే పరీక్షలకు అనుమతించాలని బోర్డు తెలిపింది.

కాగా, ఆరోగ్య సమస్యల కారణంగా హాజరు తక్కువ ఉంటే.. సంబంధిత మెడికల్ రిపోర్ట్స్‌తో కూడిన సర్టిఫికెట్‌ను.. అలాగే ఒకవేళ తల్లిదండ్రులను కోల్పోతే డెత్ సర్టిఫికెట్‌ను.. స్పోర్ట్స్ ఈవెంట్స్ వల్ల హాజరు తక్కువైతే.. దానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను అప్లికేషన్‌‌కు జత చేయాలని సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసింది.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు