AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరు గారిన ‘ మోడల్ విలేజ్ పథకం ‘.. ముఖం చాటేసిన ఎంపీలు 

దేశంలోని అన్ని గ్రామాల అభివృద్దికి లోక్ సభ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లోని ఒక్కో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని  ప్రధాని మోదీ గతంలో పిలుపునిచ్చారు. 2014 లో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ముఖ్యంగా లోక్ సభ ఎంపీలకు ఓ దిశా నిర్దేశం చేశారు. దేశంలోని అన్ని గ్రామాల అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని ‘ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ‘ […]

నీరు గారిన ' మోడల్ విలేజ్ పథకం '.. ముఖం చాటేసిన ఎంపీలు 
Anil kumar poka
| Edited By: |

Updated on: Jan 02, 2020 | 4:01 PM

Share
దేశంలోని అన్ని గ్రామాల అభివృద్దికి లోక్ సభ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లోని ఒక్కో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని  ప్రధాని మోదీ గతంలో పిలుపునిచ్చారు. 2014 లో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ రెడ్ ఫోర్ట్ నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ముఖ్యంగా లోక్ సభ ఎంపీలకు ఓ దిశా నిర్దేశం చేశారు. దేశంలోని అన్ని గ్రామాల అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని ‘ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన ‘ అనే పథకాన్ని ప్రధాని ప్రకటించారు. ఈ పథకం కింద 2016 కల్లా ఒక్కో ఎంపీ తన నియోజకవర్గాన్ని, లేదా ఆ నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలని, 2016 తరువాత మరో రెండు గ్రామాలను, అనంతరం 2019 తరువాత  కనీసం అయిదు గ్రామాలను సెలక్ట్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రాజ్యసభ ఎంపీలు కూడా ఒక్కో గ్రామ అభివృధ్దికి అనువుగా  అడాప్ట్ చేసుకోవాలని సూచించారు. ఈ దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మోడల్ విలేజిని మనం ఆదర్శవంతంగా తీర్చిదిద్దితే.. చుట్టుప్రక్కల గ్రామాలు కూడా ఆటోమాటిక్ గా అభివృధ్ది చెందుతాయని మోదీ నాడు వ్యాఖ్యానించారు.
అయితే ఐదేళ్లు గడిచిపోయాయి. ఈ పథకం పురోగతి గురించి అధికారికంగా విశ్లేషిస్తే.. లోక్ సభ ఎంపీల్లో మూడింట రెండు వంతులమంది కూడా దీని నాలుగో దశ కింద గ్రామపంచాయతీలను ఇంకా ఎంపిక  చేసుకోలేదని తేలింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన మొదటి దశలో 703 మంది ఎంపీలు ఆయా గ్రామ పంచాయతీలను సెలక్ట్ చేసుకోగా.. రెండో దశకు వచ్ఛేసరికి ఈ సంఖ్య
497 కి, మూడో దశకు వచ్ఛేసరికి 301 కి పడిపోయింది. 2014 అక్టోబరు 11 న కేంద్రం ఈ పథకాన్ని లాంచ్ చేసింది. అయితే ప్రధాని ప్రకటన చేసిన అనంతరం నాలుగు దశల్లో కేవలం 1753 గ్రామపంచాయతీలను  మాత్రమే ఎంపిక చేసినట్టు వెల్లడైంది.
గ్రామీణాభివృధ్ది మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని వెబ్ సైట్ సమాచారం ప్రకారం.. ఈ పథకం నాలుగో దశ కింద 252 మంది ఎంపీలు మాత్రమే గ్రామాలను ఎంపిక చేసుకున్నట్టు స్పష్టమైంది. ఈ దేశంలోని అనేక గ్రామాలు ఇంకా అభివృధ్ది చెందలేదంటే అందుకు  మన ఎంపీల నిర్వాకమే కారణమని వేరే చెప్పాలా ?