ఆ చట్టం బారినుంచి తప్పించుకోలేరు.. రవిశంకర్ ప్రసాద్

సవరించిన పౌరసత్వ చట్టం బారి నుంచి ఏ రాష్ట్రమూ తప్పించుకోజాలదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కేరళ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం సరికాదు.. అసలు ఈ చట్టాన్ని పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాయి కూడా.. అన్నారాయన. ఈ తీర్మాన ఆమోదం రాజ్యాంగ విరుధ్ధమని ఆయన అన్నారు. కేరళతో బాటు తొమ్మిది రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయబోమన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఓటు బ్యాంకు […]

ఆ చట్టం బారినుంచి తప్పించుకోలేరు.. రవిశంకర్ ప్రసాద్
Follow us
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2020 | 3:38 PM

సవరించిన పౌరసత్వ చట్టం బారి నుంచి ఏ రాష్ట్రమూ తప్పించుకోజాలదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాల్సిందే.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కేరళ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం సరికాదు.. అసలు ఈ చట్టాన్ని పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాయి కూడా.. అన్నారాయన.
ఈ తీర్మాన ఆమోదం రాజ్యాంగ విరుధ్ధమని ఆయన అన్నారు. కేరళతో బాటు తొమ్మిది రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయబోమన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాలకోసం కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగంలోని 245, 256 అధికరణాలను, ఇతర నిబంధనలను చదవవలసిందిగా ఆయన ఈ రాష్ట్రాలను కోరారు. పౌరసత్వం వంటి ముఖ్య అంశాలపై చట్టాలను ఆమోదించి.. వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయవలసిందిగా  కోరే అధికారాలు పార్లమెంటుకు ఉందన్న విషయాన్ని మరిచిపోరాదని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కేరళతో బాటు  పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించాయి.