ఊర౦తా కవలలే

వరంగల్‌ రూరల్‌ జిల్లా పెర్కవేడులో అడుగుపెట్టగానే కనిపించే ఓ మనిషి పోలిన వ్యక్తి మరికొంత దూరం వెళ్లగానే కనిపించవచ్చు. ఇలా ఎందరైనా కనిపించే వీలుంది. పెర్కవేడు గ్రామం 960 గడపలతో ఉంటుంది. ఆ గ్రామ జనాభా 3420 మంది. కారణాలేమిటో తెలియకున్నా కొన్నేళ్లుగా ఇక్కడ కవలలు జన్మించడం సాధారణ విషయంగా మారింది. గ్రామంలో ఇంతమంది కవలలు ఒకేవిధంగా ఉండటంతో ఆ గ్రామం వారు కవలలను పేరు పెట్టి పిలవడంలో చాలా తికమక అవుతుంటారు. గ్రామం తీరో, నీటితీరో […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:29 pm, Fri, 22 February 19
ఊర౦తా కవలలే

వరంగల్‌ రూరల్‌ జిల్లా పెర్కవేడులో అడుగుపెట్టగానే కనిపించే ఓ మనిషి పోలిన వ్యక్తి మరికొంత దూరం వెళ్లగానే కనిపించవచ్చు. ఇలా ఎందరైనా కనిపించే వీలుంది. పెర్కవేడు గ్రామం 960 గడపలతో ఉంటుంది. ఆ గ్రామ జనాభా 3420 మంది. కారణాలేమిటో తెలియకున్నా కొన్నేళ్లుగా ఇక్కడ కవలలు జన్మించడం సాధారణ విషయంగా మారింది. గ్రామంలో ఇంతమంది కవలలు ఒకేవిధంగా ఉండటంతో ఆ గ్రామం వారు కవలలను పేరు పెట్టి పిలవడంలో చాలా తికమక అవుతుంటారు. గ్రామం తీరో, నీటితీరో మరి ఈ ఒక్క గ్రామంలో ఇంతమంది కవలల జంటలు ఉండడం అన్నది విశేషంగా మారింది.