రష్మిక తో పెళ్లి కావాలి.. 4 ఏళ్ళ బుడతడు కోరిక

రష్మిక తో పెళ్లి కావాలి.. 4 ఏళ్ళ బుడతడు కోరిక

4 ఏళ్ళ బుడతడికి.. రష్మిక మందన్నా కావాలట.. ఏదో ఫోటో దిగడానికి అనుకుంటున్నారా. కాదండీ ఏకంగా పెళ్లి చేసుకోవడానికి కావాలట. ఇది నిజమండీ. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ పెళ్లి ప్రపోజల్ ఏకంగా రష్మిక కు సైతం చేరిపోయింది. ఆమె ‘నన్ను పెళ్లి చేసుకుంటావా.. నిన్ను చూస్తుంటే నాకు తెగ సిగ్గేస్తోంది’ అని అనేసింది.   అసలు విషయం లోకి వెళ్తే ప్రవీణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్.. […]

Ravi Kiran

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:27 PM

4 ఏళ్ళ బుడతడికి.. రష్మిక మందన్నా కావాలట.. ఏదో ఫోటో దిగడానికి అనుకుంటున్నారా. కాదండీ ఏకంగా పెళ్లి చేసుకోవడానికి కావాలట. ఇది నిజమండీ. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ పెళ్లి ప్రపోజల్ ఏకంగా రష్మిక కు సైతం చేరిపోయింది. ఆమె ‘నన్ను పెళ్లి చేసుకుంటావా.. నిన్ను చూస్తుంటే నాకు తెగ సిగ్గేస్తోంది’ అని అనేసింది.  

అసలు విషయం లోకి వెళ్తే ప్రవీణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ప్రతీ అనే బుడ్డోడి పై సరదాగా ఈ వీడియో తీశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ప్రతీ ఎవర్ని పెళ్లి చేసుకుంటావ్ నాన్నా అంటే.. రష్మిక అంటూ ఠక్కున ఆన్సర్ ఇచ్చాడు. ఇంతకీ రష్మిక ఎవరూ అని అడిగితే.. అది కూడా తెలియదా.. హీరోయిన్.. ఇంకేం ఇంకేం కావాలే అనే సాంగ్ లో వస్తుంది కదా. ఆ అమ్మాయే. నీ కంటే పెద్దది కదరా.. అని అంటే పోనీ సమంతా ని చేసుకుంటా అని అంటున్నాడు. ఒరేయ్ సమంతాకి పెళ్లైపోయింది రా అంటే.. అయితే రష్మిక నే కావాలి.. ఇంకెవరూ వద్దూ.. అని అంటున్నాడు. ,మీరెవరైనా రష్మిక ను చేసుకుంటే కొట్టేస్తా అంటూ రష్మిక కు ఆర్య లాంటి వన్ సైడ్ లవర్ పెళ్లి ప్రపోజల్ ముందుంచాడు.

ఇది ఇలా ఉంటే ఈ బుడ్డోడికి రష్మిక కూడా ఫ్లాట్ అయిపొయింది. ‘ వావ్.. నన్ను పెళ్లి చేసుకుంటావా.? అయ్యో నాకు చాలా సిగ్గు బాబు.. చాలా క్యూట్ గా ఉన్నావ్.. టూ మచ్ లవ్ యు లిటిల్ మేన్’ అని ట్వీట్ చేసింది. ఇలా మన వన్ సైడ్ లవ్ ఆర్య ప్రేమకథ సుఖాంతం అయింది. ఏది ఏమైనా రక్షిత్ రెడ్డి, విజయ్ దేవరకొండ, నాగ శౌర్య లాంటి హీరోలందరిని దాటి రష్మిక తో లవ్ యు టూ చెప్పించుకున్నాడు అంటే బుడ్డోడు ఘటికుడే.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu