TSRTC: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి.. ఇంకా ఉద్యోగులకు అందని జీతాలు..
తెలంగాణ ఆర్టీసీలో సిబ్బందికి, ఉద్యోగులకు ఈ నెల ఇంకా జీతాలు అందలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 15వ తేదీ దాటినా కూడా ఇంకా జీతాలు అందకపోవడం...
TSRTC: తెలంగాణ ఆర్టీసీలో సిబ్బందికి, ఉద్యోగులకు ఈ నెల ఇంకా జీతాలు అందలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 15వ తేదీ దాటినా కూడా ఇంకా జీతాలు అందకపోవడం ఆర్టీసీ చరిత్రలోనే ఇదే తొలిసారి. తక్షణం వేతనాలు ఇవ్వకుంటే బుధవారం నుంచి ఆందోళనకు ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపునిచ్చాయి.
ప్రతి నెల 10నుంచి 12 తేదీల మధ్యలో చెల్లింపు చేయాల్సి ఉండగా.. 16 తేదీ వచ్చినా వాటి ఉసెత్తడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నేడు అన్ని డిపోల వద్ద ఆందోళన చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం జీతాలు 1వ తేదీకి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇంకా జీతాలు అందలేదు.
Also Read:
నిమ్మరసంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..
పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. మనిషి బొమ్మ గీసి..వికృతంగా పసుపు, కుంకుమ చల్లి…