AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian citizenship: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు..

Indian Citizenship: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

Indian citizenship: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు..
Shiva Prajapati
|

Updated on: Feb 16, 2021 | 1:29 PM

Share

Indian Citizenship: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని కేంద్ర ప్రభుత్వం మరోసారి కోర్టుకు తెలిపింది. చెన్నమనేని పౌరసత్వంపై కేంద్ర ప్రభుత్వానికి సంబందం లేదని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు వాదించారు. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ భారత దేశంలోని ఉన్నాడని కోర్టుకు వివచింరారు. అంతేకాదు.. చెన్నమనేని రమేష్ రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజలు చెన్నమనేని రమేష్‌ను కావాలనుకుంటున్నారి ఏడీజీ కోర్టుకు తెలిపారు. చెన్నమనేని రమేష్ వలన శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందంటే అది రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు. చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామనాని కోర్టుకు ఏడీజీ తెలిపారు. అయితే, ఈ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వం స్పందించిందని ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also read:

తెలంగాణలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ.. నేటి నుంచి ఐదు రోజుల పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుల స్వీకరణ

గ్రెటా థన్‌బర్గ్‌ – దిశారవి చాటింగ్‌, ఖలిస్తాన్ సపోర్టర్స్ తోనూ లింకులు, టూల్‌కిట్‌కు షంతను, దిశ, నికిత అడ్మిన్‌లు.!