AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh-Rajamouli: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, క్రేజీ కాంబినేషన్ కు ముహుర్తం ఫిక్స్

'గుంటూరు కారం' విడుదలైన కొద్ది రోజులకే సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ కోసం జర్మనీ వెళ్లాడు. అయితే అక్కడ వర్కవుట్స్ పై ఫోకస్ చేసి బాడీని బిల్డ్ చేసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ విషయం ఏమిటంటే.. ఎస్ఎస్ రాజమౌళితో ఈ తదుపరి ప్రాజెక్ట్కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ చర్చలలో మహేశ్ పాల్గొన్నాడు.

Mahesh-Rajamouli: మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, క్రేజీ కాంబినేషన్ కు ముహుర్తం ఫిక్స్
Mahesh Babu
Balu Jajala
|

Updated on: Feb 17, 2024 | 5:34 PM

Share

‘గుంటూరు కారం’ విడుదలైన కొద్ది రోజులకే సూపర్ స్టార్ మహేష్ బాబు వెకేషన్ కోసం జర్మనీ వెళ్లాడు. అయితే అక్కడ వర్కవుట్స్ పై ఫోకస్ చేసి బాడీని బిల్డ్ చేసినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ విషయం ఏమిటంటే.. ఎస్ఎస్ రాజమౌళితో ఈ తదుపరి ప్రాజెక్ట్కు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ చర్చలలో మహేశ్ పాల్గొన్నాడు. ప్రస్తుతం మహేశ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB29కి సంబంధించిన చర్చలో పాల్గొనబోతున్నాడు. సూపర్ స్టార్, రాజమౌళి వచ్చే వారం సమావేశం కానున్నారు.

వారు తమ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ అంశాల గురించి చర్చించనున్నారు. ఈ భారీ చిత్రాన్ని ఉగాది రోజున అధికారికంగా లాంచ్ చేయనున్నట్టు చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రీ-ప్రొడక్షన్, షెడ్యూల్స్, కాస్టింగ్ ఎంపికలు, ఇతర ముఖ్యమైన విషయాల గురించి హీరో, దర్శకుడు చర్చిస్తారని టాలీవుడ్ టాక్. నివేదికల ప్రకారం.. ఇది లంచ్ మీటింగ్. సూపర్ స్టార్ కమిట్‌మెంట్‌లను చూసి తేదీని ఖరారు చేస్తారు. వీలయినంత త్వరగా ప్రాజెక్ట్‌ని ఎనౌన్స్ చేసి షూటింగ్‌ని స్టార్ట్ చేస్తారని హీరో, డైరెక్టర్‌ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి, మహేష్ ఇద్దరు కలిసి కనీసం 2-3 సంవత్సరాలు ప్రొడక్షన్ కొనసాగవచ్చు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్న గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ చిత్రం ఇది. ఎస్ఎస్ కాంచి, కళ్యాణి మాలిక్, రమా రాజమౌళి, కార్తికేయ మరియు రాజమౌళి కుటుంబ సభ్యులు మరికొంత మంది వివిధ విభాగాలపై కూడా పని చేయనున్నారు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్ టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా చేస్తుండటంతో క్రేజీ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ఇటీవల చర్చనీయాంశమవుతూ టాలీవుడ్ సర్కిల్ లో రెగ్యులర్ గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్  నటించిబోతున్నట్టు టాక్ కూడా వినిపించింది.

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి