Vikramarkudu Movie: జక్కన్న చెక్కిన ఊరమాస్ మూవీ.. ‘విక్రమార్కుడు’ రిలీజ్ నేటికి 15 ఏళ్లు.. ‘జింతాత జిత జిత జింతాత తా..​.’

ఒకే పోలికలతో వుండే రెండు పాత్రల్ని క్రియేట్ చేసి.. ఆ రెండింటికీ డిఫరెంట్ షేడ్స్ ఇచ్చి.. ఒకే హీరోతో చేయించడం అనేది పాత పద్ధతే. కానీ.. ఆ ఓల్డ్‌ థియరీనే గోల్డెన్‌ మూవీగా మార్చేశారు డైరెక్టర్‌ రాజమౌళి.

Vikramarkudu Movie: జక్కన్న చెక్కిన ఊరమాస్ మూవీ.. 'విక్రమార్కుడు' రిలీజ్ నేటికి 15 ఏళ్లు.. 'జింతాత జిత జిత జింతాత తా..​.'
Vikramarkudu Raviteja
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 24, 2021 | 12:58 PM

ఒకే పోలికలతో వుండే రెండు పాత్రల్ని క్రియేట్ చేసి.. ఆ రెండింటికీ డిఫరెంట్ షేడ్స్ ఇచ్చి.. ఒకే హీరోతో చేయించడం అనేది పాత పద్ధతే. కానీ.. ఆ ఓల్డ్‌ థియరీనే గోల్డెన్‌ మూవీగా మార్చేశారు డైరెక్టర్‌ రాజమౌళి. ఆయన లైనప్‌ని పవర్‌ఫుల్‌గా మార్చిన విక్రమార్కుడు మూవీ రిలీజై బుధవారానికి పదిహేనేళ్లు. విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబు.. ఏమాత్రం పొంతన లేని ఈ రెండు క్యారెక్టర్లనీ కలిపి.. సాలిడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ విక్రమార్కుడు. అప్పటికే ఎన్టీయార్, నితిన్‌, ప్రభాస్‌లతో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినప్పటికీ.. రవితేజతో చేసిన విక్రమార్కుడు.. రాజమౌళికి జక్కన్న అనే రాజముద్రను శాశ్వతం చేసింది.

అమితాబ్ డాన్ మూవీకి చిన్నపాటి మార్పులు చేస్తే విక్రమార్కుడైంది… ఏముంది ఇందులో కొత్తగా… అని నోళ్లు నొక్కుకున్నవాళ్లే.. తర్వాత దానికొచ్చిన భారీ వసూళ్లను చూసి నోరెళ్లబెట్టేశారు. కథ ఏదైనా దానికి రాజమౌళి ఇచ్చే ట్రీట్‌మెంట్ వెరీవెరీ స్పెషల్ అని ఒప్పేసుకున్నారు సినీ పండిట్స్‌. రవితేజ యాక్షన్‌తో పాటు.. అనుష్క గ్లామర్‌ని జక్కన్న ప్రజెంట్ చేసిన తీరు విక్రమార్కుడుని హైట్స్‌లో నిలబెట్టింది. బ్రహ్మానందంతో కలిసి రవితేజ చేసిన కామెడీ సీక్వెన్స్… అజయ్‌ చూపించిన టెరిఫిక్ విలనిజం… మదర్‌ సెంటిమెంట్‌.. ఇలా రకరకాల ఫ్లేవర్స్‌ కలిసి మాంచి స్టఫ్డ్‌ మూవీ చూసిన ఫీలింగ్‌నిచ్చింది విక్రమార్కుడు. ఎప్పట్లాగే కీరవాణి ట్యూన్స్‌ జక్కన్న సినిమాకు ప్లస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా జింతాత ఎక్స్‌పరిమెంట్.. అప్పట్లో టూ క్రేజీ.

కన్నడలో సుదీప్, తమిళంలో కార్తీ, హిందీలో అక్షయ్ కుమార్ రీమేక్ చేసి.. విక్రమార్కుడుతో మంచి ఎడ్వాంటేజ్ పొందారు. టోటల్‌గా ఛత్రపతితో వచ్చిన ఇమేజ్‌ని రెట్టింపు చేసి… దర్శకధీరుడ్ని బాహుబలి దాకా తీసుకొచ్చిన గ్రేట్ మూవీ విక్రమార్కుడు. అటు.. సినిమాల్లో పవర్‌ఫుల్‌ పోలీస్ రోల్స్‌కి ట్రెండ్‌ సెట్టర్ కూడా ఇదే.

Also Read:  ‘జూలై చివరి వారంలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలు..’ సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ అఫిడవిట్‌

వివాదాల్లో ‘గ్రాహన్’ వెబ్ సిరీస్‌.. జాతీయ స్థాయిలో రచ్చ.. ఎందుకంటే..?