సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి చిన్న కూతురు.. ముహూర్తం ఫిక్స్ చేసిన బోనికపూర్.!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `ధడక్` సినిమాతో అడుగు పెట్టిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో..

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న శ్రీదేవి చిన్న కూతురు.. ముహూర్తం ఫిక్స్ చేసిన బోనికపూర్.!
Follow us

|

Updated on: Jan 29, 2021 | 8:17 AM

khushi kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. `ధడక్` సినిమాతో అడుగు పెట్టిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతూ వస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఖుషీని లంచ్ చేయడానికి సిద్ధమయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు సినీరంగ ప్రవేశం చేయడానికి ముహూర్తం ఖరారైందనితెలుస్తుంది. ఇక ఖుషీకపూర్ వచ్చే ఏడాది లాంచ్ అవుతుందని ఆ మేరకు బోనీ ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖుషీ లండన్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తుంది. ఒక వేళ ఈ వార్త నిజమైయితే ఖుషీకపూర్ నటించే తొలిసినిమా అనౌన్స్ మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. అసలే బాలీవుడ్ లో నెపోటిజం పై పెద్దఎత్తున విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ స్టార్ కిడ్ ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Master Movie : నష్టాలను భర్తీ చేయాలని కోరుతున్న ‘మాస్టర్’ మూవీ డిస్టిబ్యూటర్లు.. నిర్మాతలు ఏమంటున్నారంటే