AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?

భారత క్రికెట్‌లో అత్యంత దూకుడైన ఆటగాడు అనగానే చాలామంది విరాట్ కోహ్లీని గుర్తు చేసుకుంటారు. అయితే, కోహ్లీ రాకముందే కేరళకు చెందిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తనదైన అగ్రెషన్‌తో ప్రత్యర్థులకు గట్టి జవాబు ఇచ్చేవాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Virat Kohli: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?
Virat Kohli
Ravi Kiran
|

Updated on: Jan 30, 2026 | 8:01 AM

Share

విరాట్ కోహ్లీ కంటే ముందే భారత క్రికెట్‌లో శ్రీశాంత్ దూకుడుకు మారుపేరుగా నిలిచాడు. 2006లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆండ్రే నీల్ రెచ్చగొట్టగా, శ్రీశాంత్ బౌలర్ తలపై నుంచి భారీ సిక్స్ కొట్టి, డ్యాన్స్ చేసి జవాబు ఇచ్చాడు. అగ్రెషన్ విషయంలో శ్రీశాంత్‌ను కోహ్లీ బౌలింగ్ వెర్షన్‌గా చెప్పొచ్చు. వివరాల్లోకి వెళ్తే.. భారత క్రికెట్‌లో అత్యంత దూకుడైన ఆటగాడు అనగానే చాలామంది విరాట్ కోహ్లీని గుర్తు చేసుకుంటారు. అయితే, కోహ్లీ రాకముందే కేరళకు చెందిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తనదైన అగ్రెషన్‌తో ప్రత్యర్థులకు గట్టి జవాబు ఇచ్చేవాడు. దీనికి 2006లో జరిగిన ఒక సంఘటన బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ సంవత్సరం, దక్షిణాఫ్రికాకు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆండ్రే నీల్.. బ్యాటింగ్ చేస్తున్న శ్రీశాంత్‌ను తీవ్ర పదజాలంతో దూషించాడు. ‘నీ రక్తం కళ్ళ చూస్తాను, నీకు దమ్ము లేదు, నువ్వు ఒక పిరికివాడివి, తర్వాతి బంతికి నిన్ను అవుట్ చేస్తా’ అంటూ నోటికి వచ్చినట్టు తిట్టాడు.

ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..

ఈ అనూహ్య ఘటనతో శ్రీశాంత్ మొదట షాక్‌కు గురయ్యాడు. అయితే, నీల్ తర్వాతి బంతి వేసేందుకు సిద్ధమవగానే, శ్రీశాంత్ తనలో దాచుకున్న కోపాన్నంతా ఆ బంతిపై చూపించాడు. ఆండ్రే నీల్ వేసిన బంతిని బౌలర్ తలపై నుంచి కళ్లు చెదిరే భారీ సిక్స్‌గా మలిచాడు. సిక్స్ కొట్టిన అనంతరం శ్రీశాంత్ బ్యాట్‌ను గాలిలో తిప్పుతూ, డ్యాన్స్ చేస్తూ నీల్‌ను మరింత రెచ్చగొట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన కామెంటేటర్లు, సొంత జట్టు ఆటగాళ్లు నవ్వుకోగా.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మాత్రం షాక్‌కు లోనయ్యారు. దూకుడు విషయంలో శ్రీశాంత్‌ను విరాట్ కోహ్లీ బౌలింగ్ వెర్షన్‌గా చెప్పొచ్చు. ఇది భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన సంఘటనగా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..