Sachin Tendulkar: బౌలర్‌గా వార్న్ చేయలేనిది.. క్రికెట్ గాడ్ చేసి చూపించాడు.. అదేంటంటే.?
క్రికెట్ చరిత్రలో షేన్ వార్న్ పేరు ఒక లెజెండరీ స్పిన్ బౌలర్‌గా నిలిచిపోతుంది. అదే సమయంలో, సచిన్ టెండూల్కర్‌ను ఫ్యాన్స్ క్రికెట్ గాడ్‌గా పిలుచుకుంటారు. అయితే, వన్డే క్రికెట్‌లో వీరిద్దరి బౌలింగ్ గణాంకాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు చూసేద్దాం.

క్రికెట్‌లో షేన్ వార్న్ ఒక లెజెండరీ బౌలర్ కాగా, సచిన్ టెండూల్కర్ ఒక బ్యాట్స్‌మెన్. అయితే, వన్డే ఫార్మాట్‌లో వార్న్‌కు సాధ్యం కాని ఓ ఘనత సచిన్ చేసి చూపించాడు. తన వన్డే కెరీర్‌లో వార్న్‌కు కేవలం ఒక 5 వికెట్ హాల్ ఉండగా, సచిన్‌కు రెండు 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. ఈ అద్భుతమైన గణాంకాలు చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయ్. వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ చరిత్రలో షేన్ వార్న్ పేరు ఒక లెజెండరీ స్పిన్ బౌలర్‌గా నిలిచిపోతుంది. అదే సమయంలో, సచిన్ టెండూల్కర్‌ను ఫ్యాన్స్ క్రికెట్ గాడ్‌గా పిలుచుకుంటారు. అయితే, వన్డే క్రికెట్‌లో వీరిద్దరి బౌలింగ్ గణాంకాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు చూసేద్దాం. అది చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇది చదవండి: మటన్ బోటీ ఇలా తింటున్నారా.! అయితే విషంతో సమానం..
షేన్ వార్న్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 293 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలలో వార్న్‌కు కేవలం ఒకే ఒక ఫైవ్ వికెట్ హాల్(ఒక మ్యాచ్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) ఉంది. ఇదిలా ఉండగా, ప్రధానంగా బ్యాట్స్‌మెన్ అయిన సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 154 వికెట్లు తీశాడు. విశేషం ఏమిటంటే, సచిన్‌కు తన కెరీర్‌లో రెండు ఫైవ్ వికెట్ హాల్స్ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను షేన్ వార్న్ కంటే 431 ఓవర్లు తక్కువ బౌలింగ్ చేసి సాధించాడు. ఒక పార్ట్‌టైమ్ బౌలర్‌గా సచిన్ సాధించిన ఈ రికార్డు, వన్డే ఫార్మాట్‌లో ఎవ్వరికీ సాధ్యం కానిది అని చెప్పొచ్చు. ఈ గణాంకాలు షేన్ వార్న్ లాంటి టాప్ బౌలర్ కంటే సచిన్ టెండూల్కర్‌కు బౌలింగ్‌లో వచ్చేయంటేనే క్రికెట్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇది చదవండి: జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది అతడే..
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




