AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం, అదే క్రేజ్

ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ 50కి పైగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. కొంతమంది హీరోలు 100కు పైగా సినిమాలు చేసి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాణించారు. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు కొందరు హీరోయిన్స్.

14ఏళ్లకే హీరోయిన్.. 300లకు పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం, అదే క్రేజ్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2026 | 9:59 AM

Share

తెలుగు ఇండస్ట్రీలో ఆమె ఓ ధ్రువతార. అందం అభినయంలో ఆమె ఓ అద్భుతం. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల అంతులేని అభిమానం సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించడమే కాదు.. ఆ హీరోలకు గట్టి పోటీ ఇచ్చింది. ఎంతో మంది దిగ్గజ దర్శకుల చేత శబాష్ అనిపించుకుంది ఆమె. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ చిత్రాలతో నటించి సత్తా చాటింది ఆ అందాల తార. చూడచక్కని రూపం.. అబ్బురపరిచే అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. అప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.

 ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

హీరోయిన్ గా రాణించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. దశాబ్దాలపాటు అనేక చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. ఇంతకూ  ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?  సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈహీరోయిన్.. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ పలు సినిమాలు చేసింది. సినిమాలతోనే కాకుండా ఇటు రాజకీయాలతోనూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు తనే హీరోయిన్ జయప్రద.. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసింది ఈ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?

స్కూల్లో ఓ నాట్య ప్రదర్శన చేస్తుండగా చూసి నటుడు ఏం ప్రభాకర్ రెడ్డి ఆమెను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాల నిడివిగల పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అలా మొదలైన సినీ ప్రస్థానం దాదాపు 2005 వరకు సాగింది. అంటే మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. వివిధ భాషల్లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించి అలరించారు. కానీ తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకుంది జయప్రద. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జయప్రద.. 1986 జూన్ 22న సినీ నిర్మాత నహతాను వివాహం చేసుకున్నారు. 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరిన ఆమె.. ఆ తర్వాత బిజేపీలోకి మారారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా జయప్రద.

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర