జెట్ ఉద్యోగులకు మేమున్నాం- స్పైస్‌జెట్‌

ఢిల్లీ: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన జెట్ ఎయిర్‌వేస్ పైలట్లకు, ఉద్యోగులకు మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ భరోసా ఇచ్చింది. తమ సంస్థల్లో వారికి అవకాశం కల్పిస్తామని స్పైస్ జెట్ ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ స్పష్టం చేశారు. తామిప్పటికే 100 మందికి పైగా పైలట్లు, 200 మంది క్యాబిన్‌ సిబ్బంది, 200 మందికి పైగా సాంకేతిక, విమాన […]

జెట్ ఉద్యోగులకు మేమున్నాం- స్పైస్‌జెట్‌
Follow us

|

Updated on: Apr 20, 2019 | 7:54 AM

ఢిల్లీ: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన జెట్ ఎయిర్‌వేస్ పైలట్లకు, ఉద్యోగులకు మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ భరోసా ఇచ్చింది. తమ సంస్థల్లో వారికి అవకాశం కల్పిస్తామని స్పైస్ జెట్ ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ స్పష్టం చేశారు. తామిప్పటికే 100 మందికి పైగా పైలట్లు, 200 మంది క్యాబిన్‌ సిబ్బంది, 200 మందికి పైగా సాంకేతిక, విమాన సిబ్బందిని జెట్ నుంచి తీసుకున్నామని, త్వరలో మరిన్ని విమానాలు కొనుగోలు చేస్తామని.. విస్తరణలో భాగంగా మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కలిపిస్తామని స్పైస్‌జెట్‌ వెల్లడించింది. కేంద్రం అనుమతిస్తే దేశీయంగా 24 కొత్త సర్వీసులను నడుపుతామని గురువారం స్పైస్‌జెట్‌ ప్రకటించింది. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయితే.. ఏప్రిల్‌ 26 నుంచి మే 2 మధ్య కొత్త సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.