AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ : మద్యం, ఇసుక అక్రమ రవాణా చేస్తే..ఆస్తుల జ‌ప్తు…!

ఏపీ ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోప‌నున్న‌ట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్ల‌డించారు. రాష్ట్ర బోర్డ‌ర్ ఏరియాల్లో ముమ్మర చెకింగ్స్ చేస్తూ ఇసుక, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో టెక్నాల‌జీ సైతం వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రివేళల్లో గస్తీని ప‌కడ్బందీగా ఏర్పాటు చేసి మెరుపు దాడులు చేస్తున్నట్లు వివ‌రించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా విషయంలో ప్ర‌భుత్వం, అధికారులు ఎన్ని […]

ఏపీ : మద్యం, ఇసుక అక్రమ రవాణా చేస్తే..ఆస్తుల జ‌ప్తు...!
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 31, 2020 | 9:20 AM

Share

ఏపీ ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోప‌నున్న‌ట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్ల‌డించారు. రాష్ట్ర బోర్డ‌ర్ ఏరియాల్లో ముమ్మర చెకింగ్స్ చేస్తూ ఇసుక, మద్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో టెక్నాల‌జీ సైతం వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రివేళల్లో గస్తీని ప‌కడ్బందీగా ఏర్పాటు చేసి మెరుపు దాడులు చేస్తున్నట్లు వివ‌రించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణా విషయంలో ప్ర‌భుత్వం, అధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌డుతున్నా, ప్రజల సహకారం తప్పకుండా ఉండాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ మద్యం, ఇసుక రవాణా విషయంలో ఇప్పటివరకు 485 కేసులు నమోదు చేసి… 955 మందిపై కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్ల‌డించారు. అలాగే 730 వాహనాలను సీజ్‌ చేసి 29,629 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడితే ఊహించ‌ని చర్యలు తీసుకుంటామని.. పాత నేరగాళ్లు అయితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై రౌడీషీట్స్‌ తెరచే ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. వారి ఆస్తులను సైతం జప్తు చేసేందుకు వెనకాడమని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేశారు.

Follow Us
చక్కెర లేని ఆహారమే ఆరోగ్యం అనుకుంటున్నారా?
చక్కెర లేని ఆహారమే ఆరోగ్యం అనుకుంటున్నారా?
ట్రిమ్మర్‌తో మీసాల లుక్ పాడైందా? ఇలా కవర్ చేస్తే లుక్ పర్ఫెక్ట్
ట్రిమ్మర్‌తో మీసాల లుక్ పాడైందా? ఇలా కవర్ చేస్తే లుక్ పర్ఫెక్ట్
అమ్మోరు సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
అమ్మోరు సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వచ్చి కొత్త రికార్డ్ సెట్ చేసిన బుడ్డోడు.
అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వచ్చి కొత్త రికార్డ్ సెట్ చేసిన బుడ్డోడు.
ఒక చిన్న అలవాటు మీ ప్రాణాలకు శ్రీ రామరక్ష!
ఒక చిన్న అలవాటు మీ ప్రాణాలకు శ్రీ రామరక్ష!
కనురెప్పలు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
కనురెప్పలు ఒత్తుగా, పొడవుగా పెరగాలా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి
ఆందోళన వద్దు.. దేశంలో ఇంధన, ఎరువు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి-కేందం
ఆందోళన వద్దు.. దేశంలో ఇంధన, ఎరువు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి-కేందం
వరుసగా రోడ్డెక్కుతున్న ఆక్వా రైతులు. ఈ పరిస్థితికి కారణమేంటి..?
వరుసగా రోడ్డెక్కుతున్న ఆక్వా రైతులు. ఈ పరిస్థితికి కారణమేంటి..?
హెన్నా నేచురల్ అని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారా?నష్టం తెలిస్తే..
హెన్నా నేచురల్ అని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారా?నష్టం తెలిస్తే..
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం
హైదరాబాదీలకు అలర్ట్.. వాటర్ ట్యాంక్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం