విషమంగానే బాలు ఆరోగ్యం.. ఎక్మో సపోర్ట్‌తో చికిత్స..
కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని..

SPB Latest Health Update: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. బాలు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని.. ప్రస్తుతం ఆయనకు ఎక్మో సపోర్ట్‌తో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ వైద్య నిపుణుల బృందం ఎస్పీబీకి చికిత్స అందిస్తున్నారని.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని ఎంజీఎం ఆసుపత్రి వెల్లడించింది.
కాగా, ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై ఈ మధ్యాహ్నం ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ భావోద్వేగ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ”నాన్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని చరణ్ భావోద్వేగానికి గురయ్యారు. మీ ప్రార్థనలు తప్పకుండా నాన్నని బతికిస్తాయని చరణ్ తెలిపారు. ”సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు ఈ రోజు నాన్న కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. వారందరికీ మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నాన్న ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. మేము ధైర్యంగా ఉన్నాం. భగవంతుడు ఉన్నాడు. నాన్నని కాపాడుతాడు” అంటూ చరణ్ వీడియోను విడుదల చేశారు.
Also Read:
కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..
