మా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది…
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనాతో పోరాడుతూ ఎస్పీబీ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే....

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనాతో పోరాడుతూ ఎస్పీబీ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై ప్రతీ రోజు ఆయన అప్‌డేట్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ వీడియో మెసెజ్‌ను అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం ఇంట్లోనే మందులు వాడుతున్నారని తెలిపారు.
‘‘మా అమ్మ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఆమె ఇంటికి వచ్చారు. ప్రస్తుతం మందులు వాడుతున్నారు. నిన్నా ఈరోజూ, నేను ఆస్పత్రికి వెళ్లాను. నాన్న ఆరోగ్యం గురించి వైద్యులు నాకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తున్నారు. ఆయన ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉందని తెలిపారు. కొన్ని రోజులుగా మంచానికే పరిమితం కావడంతో కండరాల పునరుత్తేజానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఆయన ఊపిరి తీసుకోవడం కూడా మెరుగుపడింది. మీ ప్రార్థనలు, దీవెనల వల్ల ఆయన త్వరగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఇంటికి వస్తారని ఆశిస్తున్నా. రేపటి నుంచి లాక్‌డౌన్‌ను మరింత సడలించనున్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. మాస్క్‌లు పెట్టుకొని, భౌతికదూరం పాటించండి. వైరస్ బారినపడిన ప్రతి ఒక్కరూ కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని ఎస్పీ చరణ్ కోరారు.




