నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు.

నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 21, 2020 | 7:35 PM

SP Balu Health Condition: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఓ వీడియోను విడుదల చేశారు. ”నాన్నగారి ఆరోగ్య పరిస్థితి గత రెండు రోజులుగా ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని తెలిపారు. అయితే  ఇప్పుడు కొంచెం నిలకడగా ఉన్నట్టు వైద్యులు బులెటిన్‌లో తెలిపారని ఎస్పీ చరణ్ అన్నారు. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు అన్ని విధాలుగా మెరుగైన వైద్య సేవలందిస్తున్నారు. మేము చాలా ధైర్యంగా ఉన్నాం, నాన్నగారు త్వరలోనే కోలుకుంటారు”. అని ఎస్పీ చరణ్ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.

అటు ఎంజీఎం ఆసుపత్రి కూడా బాలు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆసుపత్రి వర్గాలు.. వెంటిలేటర్, ఎక్మో సహాయంతో బాలసుబ్రహ్మణంకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. విదేశీ వైద్య బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు.

Also Read:

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..