సోను సూద్ వార్నింగ్…

సోను సూద్.. పరిచయం అక్కర లేని పేరు లాక్ డౌన్ సమయంలో వలస కూలీల పాలిట దేవుడిగా మారిన సోను సూద్.. ఇప్పుడు ఎవరికి ఎక్కడ కష్టమొచ్చిందన్నా.. అక్కడ ప్రత్యేక్షమవుతున్నాడు. ఎంతటి కష్టాన్నైనా ఇట్టే పరిష్కరిస్తున్నారు.

సోను సూద్ వార్నింగ్...
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 22, 2020 | 2:21 AM

సోను సూద్.. పరిచయం అక్కర లేని పేరు లాక్ డౌన్ సమయంలో వలస కూలీల పాలిట  దేవుడిగా మారిన సోను సూద్.. ఇప్పుడు ఎవరికి ఎక్కడ కష్టమొచ్చిందన్నా.. అక్కడ ప్రత్యేక్షమవుతున్నాడు. ఎంతటి కష్టాన్నైనా ఇట్టే పరిష్కరిస్తున్నారు. ఉద్యోగం కావాలా.. ఉపాధి కావాలా.. అంటూ ఓ ట్రోల్ ఫ్రీ నెంబర్‌కు కూడా ప్రారంభించారు.

దీంతో తమకు సాయం కావాంటూ సోనూ సూద్‌ను ట్విటర్‌ వేదికగా నేరుగా కోరుతున్నారు. వాటికి సోనూ సూద్‌ వెంటనే స్పందించి తగిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కొంతమంది ఆకతాయిలు ఆయన పేరు మీద నకిలీ ట్విటర్‌ అకౌంట్‌ను క్రియోట్‌ చేశారు. అంతే కాదు @Sonu sood అనే పేరుతో ఉన్న ఖాతాను చూసి అందరు దానిని ఫాలో అవుతూ ట్వీట్స్‌ కూడా చేస్తున్నారు.

వాటికి ఆకతాయిలు సమాధానాలు ఇస్తూ వారి సమాచారం తీసుకుంటున్నారని తెలిసింది. దీంతో సోను సూద్‌ తన ఫాలోవర్స్‌కు, అభిమానులకు మెసెజ్  చేశారు. ఎవరో తన పేరు మీద నకిలీ ఖాతా తెరిచారని, దీని నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఫేక్‌ ఖాతా ఐడీని ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. అంతేకాదు, నకిలీ జీమెయిల్ ఐడీలను ఇస్తూ బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.