పరీక్షల తేదీలు వచ్చేశాయోచ్…
నెట్ పరీక్షల షెడ్యూల్‌ను యూజీసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష.. నెట్‌ను సెప్టెంబరు 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది...
నెట్ పరీక్షల షెడ్యూల్‌ను యూజీసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించే యూజీసీ జాతీయ అర్హత పరీక్ష.. నెట్‌ను సెప్టెంబరు 16 నుంచి 25 వరకు నిర్వహించాలని జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. యూజీసీ నెట్ ఉత్తీర్ణులైన వారికి కేంద్రీయ, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల ప్రొఫేసర్లుగా చేసేందుకు పనిచేసే అర్హత లభిస్తుంది.
కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన వివిధ జాతీయ స్థాయి అర్హత, ప్రవేశ పరీక్షల తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇందులో యూజీసీ నెట్, ఇగ్నో ఓపెన్‌మ్యాట్-పీహెచ్‌డీ, ఐసీఏఆర్ ఏఐఈఈఏ, డీయూ ఎంట్రెన్స్ టెస్ట్ ఉన్నాయి. మే, జూన్ నెలల్లో జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా నేపథ్యంలో వాయిదాపడ్డాయి. దీంతో తాజాగా సవరించిన పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.
ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు పరీక్షల తేదీలకు 15 రోజుల ముందు విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షల తేదీలను ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. జేఈఈ మెయిన్ సెప్టెంబర్ 1-6 వరకు, నీట్ యూజీ పరీక్షలు సెప్టెంబర్ 13న జరగనున్న విషయం తెలిసిందే.