సోనియా సమావేశం: నేడు కాంగ్రెస్‌లో ఏం జరుగబోతోంది ? ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఎలాంటి స్ట్రేటజీ.?

కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం గత కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గతంగా, బహిర్గతంగా జరుగుతున్న వివాదాలు చివరకు పార్టీకే చేటు తెచ్చే విధంగా మారాయి..

సోనియా సమావేశం:  నేడు కాంగ్రెస్‌లో ఏం జరుగబోతోంది ? ఏఐసీసీ అధ్యక్షుడి ఎంపికలో ఎలాంటి స్ట్రేటజీ.?
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 19, 2020 | 11:41 AM

కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవి కోసం గత కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గతంగా, బహిర్గతంగా జరుగుతున్న వివాదాలు చివరకు పార్టీకే చేటు తెచ్చే విధంగా మారాయి. దీంతో పార్టీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జీ23 బృందంలో ఉన్న వ్యతిరేక స్వరాన్ని అనుకూలంగా మార్చేందుకు 15 మందితో సమావేశం ఏర్పాటు చేశారు అధినేత్రి సోనియా. పార్టీ కొత్త అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ సభ్యత్వ పదవులకు అంతర్గత ఎన్నికలు నిర్వహించాలన్నది జీ 23 బృందం డిమాండ్. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు అసమ్మతి నేతలు. అయితే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో ఉన్న సోనియాగాంధీ ఇకపై కొనసాగేందుకు సుముఖత చూపించడం లేనట్లుగా కనిపిస్తోంది. ఆ కుర్చిపై కూర్చునేందుకు రాహూల్‌ గాంధీ సైతం ఆసక్తి కనబర్చడం లేదు.

ఇక మిగిలింది ప్రియాంక గాంధీ ఒక్కరే. కాంగ్రెస్‌ నాయకుల నుంచి సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికి జీ23 బృందంలో ఎంత మంది అందుకు అనుకూలమనే విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం గాంధీ ఫ్యామిలీకి కాకుండా వేరే వారికు అప్పగించాలంటే అసమ్మతి నేతలు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు అన్నది సందిగ్ధంగా మారింది. దీనిపై పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకే పార్టీ అధినాయకురాలు నేడు హస్తినలో భేటీ ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తోంది.