Bigg Boss 4 : ఎలిమినేట్ అయిన ఆ కంటెస్టెంట్ కోసం ఎమోషనల్ అయిన అభిజీత్.. ఓదార్చిన హారిక

బిగ్ బస్ సీజన్ 4 లో యంగ్ హీరో అభిజీత్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అతడి పై ప్రేక్షకులు పాజిటివ్ గా నే ఉన్నారు. హౌస్ లో మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న అభి.

Bigg Boss 4 : ఎలిమినేట్ అయిన ఆ కంటెస్టెంట్ కోసం ఎమోషనల్ అయిన అభిజీత్.. ఓదార్చిన హారిక
Follow us

|

Updated on: Dec 19, 2020 | 11:43 AM

బిగ్ బస్ సీజన్ 4 లో యంగ్ హీరో అభిజీత్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి అతడి పై ప్రేక్షకులు పాజిటివ్ గా నే ఉన్నారు. హౌస్ లో మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న అభి. లవర్ బాయ్ గాను మారాడు. సీజన్ మొదట్లో గుజరాతీ అందం మోనాల్ తో క్లోజ్ అయిన అభిజిత్ కొద్దిరోజులు ఆ అమ్మడితో కలిసి చట్టపట్టాలేసుకు తిరిగాడు. ఆతర్వాత ఆమెను దూరం పెట్టాడు. ఆతర్వాత అల్లరిపిడుగు హారికకు దగ్గరయ్యాడు అభి. ఇప్పుడు ఈ ఇద్దరు మధ్య లవ్ ట్రాక్ నడుతుందని నెట్టింట చర్చ జరుగుతుంది.

ఇక అభిజీత్ హౌస్ లో ఉన్న వాళ్లందరితో స్నేహంగా మెలుగుతూ వస్తున్నాడు టాస్క్ ల సమయంలో 100పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నాడు. హౌస్ లో ఉన్న అభిజీత్ కు బయట భారీ ఫాలోయింగ్ ఉంది. అభిజీత్ ను బిగ్ బాస్ విన్నర్ ను చెయ్యాలని అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కోరుతున్నారు. ఇక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తోనూ అభిజీత్ మంచి స్నేహాన్ని ఏర్పరుచుకున్నాడు. హౌస్ లో ఉన్నప్పుడు నోయల్, లాస్య తో అభిజీత్ చాల స్నేహంగా ఉండేవాడు. వాళ్లిద్దరూ బయటకు వెళ్లిపోవడంతో హారిక క్లోజ్ గా ఉంటున్నాడు.  ఇక నోయల్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళేటప్పుడు అభిజీత్  గురించి గొప్పగా చెప్పాడు.

‘నీ భుజం ఎప్పుడు నొప్పిగా అనిపించినా నేను నీకు భుజంగా నిలబడతా’ అంటూ మాటిచ్చాడు. హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు జుత్తు కత్తిరించవద్దని చెప్పాడు నోయల్. అందుకు అనుగుణంగానే జుత్తు పెంచుకుంటున్నాడు అభి. అంతలా ఫ్రెండ్ షిప్ కు వ్యాల్యూ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో నోయల్ కు ఓ ఎమోషన్ పోస్ట్ రాసాడు అభి. నోయల్‌ గురించి బాధ పడుతూ ” మై జర్నీ ఫీల్ లెస్ విత్ అవుట్ యు స్టార్ బాయ్ ‘ అని వాటర్ బాటిల్‌పై నెయిల్ పాలిష్ తో రాసి ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో హారిక వచ్చి అభిని ఓదార్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నోయల్.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..