రైతుల కష్టాలను పట్టించుకోరా ? మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్, ఇది మొండి సర్కార్ అని వ్యాఖ్య

రైతుల ఆందోళన ఆదివారం నాటికి 39 వ రోజుకు చేరుకుంది. ఇన్నాళ్లుగా వారు నిరసన తెలియజేస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని...

రైతుల కష్టాలను పట్టించుకోరా ? మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫైర్, ఇది మొండి సర్కార్ అని వ్యాఖ్య
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2021 | 9:05 PM

రైతుల ఆందోళన ఆదివారం నాటికి 39 వ రోజుకు చేరుకుంది. ఇన్నాళ్లుగా వారు నిరసన తెలియజేస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి కష్టాలను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. అన్నదాతలు కోరుతున్నట్టు వివాదస్పద చట్టాలను మూడింటినీ వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యమంటే రైతులు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడమేనని, ఈ శీతాకాలంలో వర్షాలు పడుతుండగా..ఢిల్లీలో ఇన్ని రోజులుగా రైతులు నిరసన చేస్తున్నారని ఆమె అన్నారు. వారి దుస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా 50 మందికి పైగా అన్నదాతలు మరణించారని, పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. అయినా మోదీ ప్రభుత్వం గానీ, మంత్రులు గానీ కించిత్ విచారాన్ని ప్రకటించలేదని,, కనీసం సానుభూతిని కూడా తెలియజేయలేదని ఆమె పేర్కొన్నారు.

పైగా రైతుల ఆందోళనను కించ పరిచేట్టుగా బీజేపీ నేతలు రకరకాల  వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.