HawkEye app : మొబైల్‌ ఫోన్‌ పోతే హాక్‌-ఐలో ఫిర్యాదు చేయండి.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచన

మొబైల్ ఇప్పుడు మనిషికి నిత్యావసరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువే. చేతిలో మొబైల్ ఉంటే..ప్రపంచంలోని ఏం జరుగుతున్నా తెలిసిపోతుంది.

HawkEye app  : మొబైల్‌ ఫోన్‌ పోతే హాక్‌-ఐలో ఫిర్యాదు చేయండి.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచన
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 03, 2021 | 9:04 PM

HawkEye app :  మొబైల్ ఇప్పుడు మనిషికి నిత్యావసరంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే దాని ప్రాముఖ్యత అంతకంటే ఎక్కువే. చేతిలో మొబైల్ ఉంటే..ప్రపంచంలోని ఏం జరుగుతున్నా తెలిసిపోతుంది. ఇక మన వ్యక్తిగత ఫోటోలు, డేటా తదితరాలు అన్నీ ఫోన్‌లో నిక్షిప్తం చేస్తున్నాం. ఈ క్రమంలో పోయిన మొబైల్ ఫోన్‌లను..తిరిగి యజమానులకు అప్పగించడం చాలా అవసరమని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. అందుకే హాక్‌ఐ లాస్ట్‌ మొబైల్‌ ఫోన్‌లో కంప్లైంట్ చేసిన వాటిని ఐఎంఈఐ నంబర్‌ ఆధారంగా ఐడెంటిఫై చేసి.. వాటిని రికవరీ చేస్తున్నారు.

తాజాగా 35 కంప్లైంటులకు సంబంధించి రికవరీ చేసిన మొబైల్‌ ఫోన్‌లను సీపీ అంజనీకుమార్‌ యజమానులకు అందించారు . 2015లో ప్రారంభమైన హాక్‌ ఐ యాప్‌ అప్లికేషన్ ప్రారంభమైంది. అప్పట్నుంచి దాదాపు 500 మొబైల్‌ ఫోన్‌లను గుర్తించి వాటిని తిరిగి యజమానులకు అందించినట్లు పోలీసులు తెలిపారు.  మొబైల్‌ ఫోన్‌ పోతే.. వెంటనే హాక్‌-ఐలో కంప్లైంట్ చేయాలని సీపీ అంజనీకుమార్ సూచించారు.

Also Read :

LPG Gas Cylinders: గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్‌కి ఒక్క రూపాయి ఇవ్వక్కర్లేదు..తేల్చి చెప్పిన హెచ్‌పీసీఎల్

TSRTC : సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు టీఎస్​ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే బస్సు సర్వీసులు

Tragedy : పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..కుటుంబం మొత్తాన్ని వెంటాడిన మృత్యువు..మరీ ఇలానా..?