పాము గుడ్లను పొదిగించి.. పిల్లలను పెంచుకుంటున్నాడు..!
కర్నాటకలో ఓ వ్యక్తి పాము గుడ్లనుంచి బయటికొచ్చిన పాము పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అవి 16 పాము పిల్లలు. బెంగుళూరు శివారు నెలమంగళకు చెందిన లోకేష్‌కి పాములు పట్టడమే ప్రవృత్తి. ఎవరి ఇంట్లోనైనా.. పాములు కనిపిస్తే.. ఇతనికే ఫోన్ చేస్తారు. వెళ్లి వాటిని పట్టుకొని.. దూర ప్రాంతాల్లో వదిలేస్తాడు. అందుకే ఇతన్ని స్నేక్ లోకేష్ అని పిలుస్తారు. మూడు నెలల క్రితం.. హేసరఘట్టలోని తన స్నేహితుడు నారాయణ ఇంట్లో ఓ […]

కర్నాటకలో ఓ వ్యక్తి పాము గుడ్లనుంచి బయటికొచ్చిన పాము పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అవి 16 పాము పిల్లలు. బెంగుళూరు శివారు నెలమంగళకు చెందిన లోకేష్‌కి పాములు పట్టడమే ప్రవృత్తి. ఎవరి ఇంట్లోనైనా.. పాములు కనిపిస్తే.. ఇతనికే ఫోన్ చేస్తారు. వెళ్లి వాటిని పట్టుకొని.. దూర ప్రాంతాల్లో వదిలేస్తాడు. అందుకే ఇతన్ని స్నేక్ లోకేష్ అని పిలుస్తారు.
మూడు నెలల క్రితం.. హేసరఘట్టలోని తన స్నేహితుడు నారాయణ ఇంట్లో ఓ నాగుపాము గుడ్లు పెట్టిందని, ఈ విషయాన్ని అతను తనకు తెలియజేయగా.. వాటిని తన వెంట తెచ్చుకుని వాటిని పొదిగించినట్లు చెప్పాడు స్నేక్ లోకేష్. ఈ మూడు నెలల పాటు వాటిని జాగ్రత్తగా చూసుకున్నానని, ఇప్పుడవి పగిలి పాము పిల్లలు బయటికొచ్చాయని చెబుతున్నాడు. కాగా.. వీటిని తనే పెంచుకుంటున్నట్లు చెప్పడం ట్విస్ట్.