Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లివ్ ఇన్-రిలేషన్ షిప్…లీగల్ లా ఏమంటోంది ?

సహజీవనం..పెళ్లి అనే మాట ఎత్తకుండా ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి చేసే జీవితం.. ఇది మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తరువాత మూన్నాళ్ళ ముచ్చటే అయితే.. చట్టాలు ఏం చెబుతున్నాయి ? పెళ్లి చేసుకుంటానని చెప్పి..ప్రమాణం కూడా చేసి.. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తకుండా ముఖం చాటేసే ఘనాపాటీల తోనే వచ్చింది చిక్కంతా.. ఇది అత్యాచారం కిందికే వస్తుందా ? బాధిత మహిళ చేసే ఫిర్యాదుకు బలం ఉంటుందా ? విషయం మొదట సహజంగానే పోలీసుల […]

లివ్ ఇన్-రిలేషన్ షిప్...లీగల్ లా ఏమంటోంది ?
Follow us
Anil kumar poka

|

Updated on: May 15, 2019 | 11:34 AM

సహజీవనం..పెళ్లి అనే మాట ఎత్తకుండా ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి చేసే జీవితం.. ఇది మొదట్లో బాగానే ఉన్నా.. ఆ తరువాత మూన్నాళ్ళ ముచ్చటే అయితే.. చట్టాలు ఏం చెబుతున్నాయి ? పెళ్లి చేసుకుంటానని చెప్పి..ప్రమాణం కూడా చేసి.. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తకుండా ముఖం చాటేసే ఘనాపాటీల తోనే వచ్చింది చిక్కంతా.. ఇది అత్యాచారం కిందికే వస్తుందా ? బాధిత మహిళ చేసే ఫిర్యాదుకు బలం ఉంటుందా ? విషయం మొదట సహజంగానే పోలీసుల వరకూ వస్తుంది. సదరు మహిళ పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే ! ఖాకీలు తొలుత దీన్ని ‘ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ ‘ కేసుగా బుక్ చేస్తారు. అదే సమయంలో డొమెస్టిక్ వయలెన్స్ కిందికి వస్తుందా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తారు. పెళ్లి వరకు దారి తీయని పరిస్థితుల్లో బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకం. సహజీవనాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ముంబై హైకోర్టు కూడా దీనికి ఓకె చెప్పింది. గృహ హింస నుంచి మహిళలను రక్షించేందుకు చట్టమంటూ ఒకటుంది. కానీ.. కొన్ని కేసుల్లో రేప్ వంటి ఘటనల విషయంలో చట్ట నిబంధనలు ‘ కాస్త దూరం ‘ జరిగినట్టే నని కూడా కోర్టు చేసిన వ్యాఖ్యలను పోలీసు వ్యవస్థ నిశితంగా పరిశీలిస్తోంది. నిర్భయ వంటి కేసులకు, సాధారణ కేసులకు మధ్య తేడాను వేర్వేరుగా చూడాలని న్యాయ నిపుణులు అంటున్నారు. దురదృష్టవశాత్తూ అత్యాచారం అన్నదానికి నిర్వచనం ఫిర్యాదుల రూపంలో ప్రముఖంగా చోటు చేసుకుందని వారి భావన.. సహజీవనం చేస్తున్నవారికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయినప్పుడు పోలీసులు దీన్ని సివిల్ కేసుగా బుక్ చేస్తారన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ ఇలాంటి జంటల వయస్సును కూడా సుప్రీంకోర్టు పరిశీలించడం గమనార్హం. 2005 నాటి గృహ హింస చట్టం..మహిళల రక్షణ అన్నదాన్ని పేర్కొంటూనే.. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జంటల వయస్సును కోర్టు ప్రముఖంగా ప్రస్తావించింది. చట్ట సభలు ఈ అంశాన్ని గుర్తించాలని సూచించింది. కేరళకు చెందిన నందకుమార్ అనే యువకుడు తనది పెళ్లి ఈడు కాదని, అయినా నిండా ప్రేమలో మునిగిన తాను తుషారా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా తాను మైనర్ అంటూ తుషారా తలిదండ్రులు ఆమెను తమ వెంట తీసుకుపోయారంటూ మొదట హైకోర్టుకెక్కాడు. నందకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన కోర్టు..అతని వాదనను, అతని బర్త్ డే సర్టిఫికెట్ వగైరాలను పరిశీలించి అతని పిటిషన్ ను కొట్టివేసింది. అయితే అతగాడు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశాడు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ..అతని వాదన నమ్మశక్యమేనని, అయితే తుషారా తాను తలచుకుంటే అతనితో, లేదా తన తండ్రి వద్ద ఉండవచ్చునని రూలింగ్ ఇచ్చింది. ఇక్కడ ఒక కోర్టు ఇచ్చిన తీర్పును మరో కోర్టు కొట్టివేయడమే గమనార్హం.. ఇంతకీ సహజీవనానికి ఈ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పును ఇవ్వకపోవడమే విచారకరం.