Water Intake: మీరూ నిలబడి నీళ్లు తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా..
ఆరోగ్యంగా ఉండటానికి నీరు చాలా అవసరం. అయితే రోజుకి తగినంత నీరు తాగడం ఎంత అవసరమో సరైన పద్ధతిలో తాగడం కూడా అంతే అవసరం. లేదంటో లేనిపోని చిక్కుల్లో పడిపోతారు. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, సరైన బరువును నిర్వహించడానికి..
Updated on: Mar 31, 2025 | 1:23 PM

ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగడం ముఖ్యమని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో మూత్రపిండాల సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, సరైన బరువును నిర్వహించడానికి రోజుకు 3 లీటర్ల నీరు తాగడం అవసరమని వైద్యులు అంటున్నారు.

అందువల్ల, కండరాల నొప్పులు, నరాల ఒత్తిడి సమస్యలు ఎదురైతే ఉప్పునీరు తాగడం చాలా మంచిది. అదనంగా, ఆహారం త్వరగా జీర్ణం కానప్పుడు, అది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఉప్పునీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్ల స్థాయిలు సరైన స్థాయిలో ఉండటం, జీర్ణక్రియ మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది.

అలాగే చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తినేటప్పుడు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కడుపు నుంచి వివిధ రసాలు స్రవిస్తాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఈ సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, వికారం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరుగుతాయి.

బాటిల్ నుంచి కాకుండా గ్లాసు నుంచి నీరు తాగడం మంచిది. నీరు త్రాగేటప్పుడు ఒకే చోట కదలకుండా కూర్చోవాలి. నడుస్తున్నప్పుడు లేదా అస్థిరంగా ఉన్నప్పుడు నీరు తాగే ప్రయత్నం చేయవద్దు. దీనివల్ల మీ గొంతు, ముక్కులో నీరు పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిది. పళ్ళు తోముకునే ముందు నీళ్లు తప్పక తాగాలి. ఈ అలవాటు గుండెల్లో మంట సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 1 గంట తర్వాత నీరు తాగాలి.





























