మత్తు డ్రైవర్లను పట్టేశారు..!

తప్పతాగి నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు చెక్ పెట్టారు పోలీసులు. కృష్ణా జిల్లా కంచిక చర్ల సమీపంలో కీసర టోల్‌ప్లాజా వద్ద అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు ప్రైవేట్ బస్సుల డ్రైవర్‌లు ఫుల్లుగా మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. శ్రీ వెంకట పద్మావతి, జీవీఆర్ ట్రావెల్స్, శ్రీ కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ట్రావెల్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న […]

మత్తు డ్రైవర్లను పట్టేశారు..!
TV9 Telugu Digital Desk

| Edited By:

May 15, 2019 | 12:50 PM

తప్పతాగి నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతున్న ప్రైవేట్ బస్సుల డ్రైవర్లకు చెక్ పెట్టారు పోలీసులు. కృష్ణా జిల్లా కంచిక చర్ల సమీపంలో కీసర టోల్‌ప్లాజా వద్ద అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు ప్రైవేట్ బస్సుల డ్రైవర్‌లు ఫుల్లుగా మందు కొట్టి డ్రైవింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. శ్రీ వెంకట పద్మావతి, జీవీఆర్ ట్రావెల్స్, శ్రీ కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ట్రావెల్స్ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వేరే బస్సుల్లో పంపించే ఏర్పాట్లు చేశారు.

నందిగామ డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ట్రావెల్స్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటు కంచికచర్ల జగ్గయ్యపేట వద్ద శక్తి టీమ్ అవగాహన కార్యక్రమం చేపట్టింది. బస్సులో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలకు ఏవైనా ఇబ్బందులు కల్గితే వెంటనే శక్తి టీమ్‌ని సంప్రదించాలన్నారు. ఇందుకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా ప్రయాణికులకు ఇచ్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu