జవాన్లు.. పబ్జీ మాయలో పడొద్దు, ఆపై ఫోన్ల తనిఖీ

పబ్జీ.. ఈ గేమ్ పేరు చెప్పగానే చాలా దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. దీని బారినపడి యువత ప్రాణాలు పోగొట్టుకోవడం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని బ్యాన్ చేసింది చైనా. దీని సెగ భారతీయ జవాన్లను తాకింది. రక్షణలో పాలుపంచుకునే జవాన్లు సైతం దీనికి బాగా అడిక్ట్ అయ్యారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఉన్నతాధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. చాలామంది జవాన్లు పబ్జీ గేమ్ ఆడటాన్ని గమనించిన అధికారులు, దీని కారణంగా వాళ్ల పనితీరుపై ప్రభావం […]

  • Anil kumar poka
  • Publish Date - 11:27 am, Wed, 15 May 19
జవాన్లు.. పబ్జీ మాయలో పడొద్దు, ఆపై ఫోన్ల తనిఖీ

పబ్జీ.. ఈ గేమ్ పేరు చెప్పగానే చాలా దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. దీని బారినపడి యువత ప్రాణాలు పోగొట్టుకోవడం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని బ్యాన్ చేసింది చైనా. దీని సెగ భారతీయ జవాన్లను తాకింది. రక్షణలో పాలుపంచుకునే జవాన్లు సైతం దీనికి బాగా అడిక్ట్ అయ్యారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఉన్నతాధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. చాలామంది జవాన్లు పబ్జీ గేమ్ ఆడటాన్ని గమనించిన అధికారులు, దీని కారణంగా వాళ్ల పనితీరుపై ప్రభావం చూపుతోందని భావించారు. తోటి జవాన్లతో సరిగ్గా మాట్లాడకపోవడం, నిద్ర లేకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నట్టు భోగట్టా. ఈ క్రమంలో పబ్జీ గేమ్ ఆడొద్దని జవాన్లు ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఢిల్లీ హెడ్ క్వార్టర్స్‌ నుంచి సర్క్యూలర్ కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు తమ ఫోన్లలో పబ్జీ గేమ్ తొలగించాలని ఆదేశించారు అధికారులు. ఫోన్లలో గేమ్ డిలీట్ చేశారో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేయాలని నిర్ణయించారు.

చైనా ఏం చేసింది?

పబ్జీ గేమ్‌ని చైనాతోపాటు పలుదేశాలు నిషేధించడంతో మార్కెటింగ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న టెన్సెంట్‌ సంస్థ పనైపోయింది. దానికి ఈక్వెల్‌గా ‘గేమ్‌ ఫర్‌ పీస్‌’ పేరిట సరికొత్త వీడియో గేమ్‌ను తీసుకొచ్చింది. దీనికి కాసుల పంట పండిస్తోంది. చైనాలో కేవలం 72 గంటల్లో టెన్సెంట్‌కు దాదాపు వంద కోట్లు రాబట్టింది. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన గేమ్‌గా నిలిచింది. 16 ఏళ్ల పైబడి వయస్సు గల మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. 16 నుంచి 18 ఏళ్ళ వయసున్న వాళ్లు రెండు గంటలు మాత్రమే ఆటని పరిమితం చేసినట్టు ఆ కంపెనీ తెలిపింది.
మొత్తానికి పబ్జీ గేమ్ వ్యవహారం చాలా దేశాలకు తలనొప్పిగా తయారైంది.