Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదులొచ్చారు.. బీ అలర్ట్

త్వరలో భారత్‌లో భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. నేపాల్ నుంచి ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని బందీపొరాకు చేరుకున్నారని.. పలుచోట్ల దాడులు చేసేందుకు ఆ టెర్రరిస్ట్‌లు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వారు వెల్లడించారు. ఈ టెర్రరిస్ట్‌లు భారత్‌కు రావడం వెనుక షాజిద్ మిర్ అనే ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు బంగ్లాదేశ్‌ కేంద్రంగా నడుస్తోన్న జమ్మాత్ ఉల్ మొజాహుదీన్ బంగ్లాదేశ్ అనే ఉగ్రసంస్థ ఓ మహిళా సూసైడ్ […]

ఉగ్రవాదులొచ్చారు.. బీ అలర్ట్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 15, 2019 | 11:53 AM

త్వరలో భారత్‌లో భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. నేపాల్ నుంచి ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోని బందీపొరాకు చేరుకున్నారని.. పలుచోట్ల దాడులు చేసేందుకు ఆ టెర్రరిస్ట్‌లు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వారు వెల్లడించారు. ఈ టెర్రరిస్ట్‌లు భారత్‌కు రావడం వెనుక షాజిద్ మిర్ అనే ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

మరోవైపు బంగ్లాదేశ్‌ కేంద్రంగా నడుస్తోన్న జమ్మాత్ ఉల్ మొజాహుదీన్ బంగ్లాదేశ్ అనే ఉగ్రసంస్థ ఓ మహిళా సూసైడ్ బాంబర్‌ను సిద్ధం చేసిందని ఐబీ అధికారులు చెబుతున్నారు. బుద్ధ పౌర్ణిమ రోజున.. అంటే ఈ  నెల 18న బంగ్లాదేశ్, ఇండియా, మయున్మార్‌లోని బుద్ధ దేవాలయాలు టార్గెట్‌గా ఆమె ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.