జీతం అడిగితే… మహిళా ఉద్యోగిని చితకబాదారు
మహిళా ఉద్యోగి జీతం అడిగినందుకు చెలరేగిపోయాడు ఓ సెలూన్ ఓనర్. తన ముగ్గురు ప్రెండ్స్‌తో కలిసి సదరు మహిళను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్‌లో వైరల్ అయ్యింది. మహిళ అని చూడకుండా ఆమె పట్ల దుండగుల వ్యవహరించిన తీరుకు నెటిజన్లు భగ్గుమన్నారు. వివరాల్లోకి వెళ్తే..గ్రేటర్ నోయిడాలోని యూనీసెక్స్ సెలూన్‌లో పనిచేస్తోంది 25 ఏళ్ల ఆ బాధితురాలు. భాంగెల్‌లో నివసిస్తున్న ఆమెకు నెలకు రూ.17,000 ఇస్తానని చెప్పి పనిలో పెట్టుకున్నాడు ఓనర్. తీరా నెల తర్వాత […]

మహిళా ఉద్యోగి జీతం అడిగినందుకు చెలరేగిపోయాడు ఓ సెలూన్ ఓనర్. తన ముగ్గురు ప్రెండ్స్‌తో కలిసి సదరు మహిళను చితకబాదాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్‌లో వైరల్ అయ్యింది. మహిళ అని చూడకుండా ఆమె పట్ల దుండగుల వ్యవహరించిన తీరుకు నెటిజన్లు భగ్గుమన్నారు. వివరాల్లోకి వెళ్తే..గ్రేటర్ నోయిడాలోని యూనీసెక్స్ సెలూన్‌లో పనిచేస్తోంది 25 ఏళ్ల ఆ బాధితురాలు. భాంగెల్‌లో నివసిస్తున్న ఆమెకు నెలకు రూ.17,000 ఇస్తానని చెప్పి పనిలో పెట్టుకున్నాడు ఓనర్. తీరా నెల తర్వాత శాలరీ అడిగితే… అప్పటి నుంచీ తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాడట. అందుకు ఆమె నిరాకరించడంతో.. శాలరీ సాకుతో గొడవ పడి… వసీం మరో ముగ్గురు స్నేహితులు కలిసి చితకబాదారు. కాగా గత శనివారం ఈ ఘటన జరగగా..సోమవారం పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Shocking incident from Greater Noida area where a girl, in a viral video, is seen being beaten up and assaulted by a group of men with stick. @Uppolice Incident is from Knowledge Park Police Station area. pic.twitter.com/1s9tJFsCVs
— Bhartendu Sharma (@Bhartendulkar) May 13, 2019