Smart Ration Cards: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. పంపిణీ ఎప్పుడో తెలుసా..?
Smart Ration Cards: వినియోగదారులు ఫోన్‌లో టి-రేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓటీపీ ద్వారా రేషన్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఎం-పిన్ క్రియేట్ చేసుకోవాలి. కొత్త రేషన్‌కార్డుల తయారీ ఖర్చు మొత్తాన్ని పౌర సరఫరాల శాఖనే భరిస్తుందని, కార్డుదారులపై ఎలాంటి ఆర్థిక..

Telangana Smart Ration Cards: కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే ఆలస్యం. వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. సీఎం ఖరారు చేసిన తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి..
స్మార్ట్ కార్డులు అంటే ఏమిటి?
ఇప్పుడు రాష్ట్రంలో అందించే కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో ఉంటాయి. ఫొటోపై కార్డు యజమాని పేరు, చిరునామాలు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను కార్డుపై ముద్రించినట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్ కార్డులు కాగితం రూపంలో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇలా స్మార్ట్ కార్డు రూపంలో అందించడం మొదటిసారి. కార్డుపై క్యూఆర్ కోడ్ ప్రింటింగ్ చేసి ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న పూర్తి వివరాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి: Vande Bharat: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో రెండు కొత్త వందే భారత్‌స్లీపర్ రైళ్లు..!
వినియోగదారులు ఫోన్‌లో టి-రేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఓటీపీ ద్వారా రేషన్ కార్డును లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఎం-పిన్ క్రియేట్ చేసుకోవాలి. కొత్త రేషన్‌కార్డుల తయారీ ఖర్చు మొత్తాన్ని పౌర సరఫరాల శాఖనే భరిస్తుందని, కార్డుదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని అధికారుల ద్వారా సమాచారం. ఇదిలా ఉండగా,రాష్ట్రవ్యాప్తంగా 1,05,42,188కి పైగా రేషన్‌కార్డులు ఉన్నాయని, అందులోని లబ్ధిదారుల సంఖ్య 3,39,96,239కి పైగానే ఉందని వివరించారు.
ఇది కూడా చదవండి: RBI: బ్యాంకుల్లో పదే పదే KYC బాధలు ఇక ఉండవు.. RBI తెచ్చిన ఈ 14 అంకెల నంబర్ గురించి తెలుసా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




