AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంకుల్లో పదే పదే KYC బాధలు ఇక ఉండవు.. RBI తెచ్చిన ఈ 14 అంకెల నంబర్ గురించి తెలుసా?

RBI: CKYC అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. ఈ నంబర్ KYC రికార్డులకు అనుసంధానించి ఉంటుంది. ప్రతి కస్టమర్‌కు ఒక ప్రత్యేకమైన 14-అంకెల నంబర్ కేటాయిస్తారు. ఇది సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీలో స్టోరేజీ చేస్తారు. భవిష్యత్తులో మీ మొబైల్..

RBI: బ్యాంకుల్లో పదే పదే KYC బాధలు ఇక ఉండవు.. RBI తెచ్చిన ఈ 14 అంకెల నంబర్ గురించి తెలుసా?
Ckyc
Subhash Goud
|

Updated on: Jul 18, 2026 | 7:24 PM

Share

RBI: బ్యాంకు ఖాతాదారులకు తరచుగా కేవైసీని కోరుతూ పదేపదే ఫోన్ కాల్స్, నోటీసులు వస్తుంటాయి. అంతేకాకుండా వారు వేర్వేరు బ్యాంకులకు పదేపదే కేవైసీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా ప్రస్తుతం కేవైసీ పేరుతో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే మీకు 14-అంకెల సీకేవైసీ (CKYC) నంబర్ ఉన్నట్లయితే మీరు ప్రతి బ్యాంకుకు పదేపదే కేవైసీ పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆర్‌బిఐ (RBI) పేర్కొంది.

CKYC నంబర్ కలిగి ఉండటం వలన కొత్త బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు లేదా ఆర్థిక ఉత్పత్తి కోసం దరఖాస్తు చేసేటప్పుడు KYC పత్రాలను పదేపదే సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది. అయితే మీ పత్రాలు మారినట్లయితే మీరు తిరిగి నమోదు చేసుకుని, మీ సీకేవైసీని అప్‌డేట్ చేయవలసి ఉంటుంది.

CKYC అంటే ఏమిటి?

CKYC అంటే సెంట్రల్ నో యువర్ కస్టమర్. ఈ నంబర్ KYC రికార్డులకు అనుసంధానించి ఉంటుంది. ప్రతి కస్టమర్‌కు ఒక ప్రత్యేకమైన 14-అంకెల నంబర్ కేటాయిస్తారు. ఇది సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీలో స్టోరేజీ చేస్తారు. భవిష్యత్తులో మీ మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామా లేదా ఇంటి చిరునామా మారినట్లయితే, మీరు ప్రతి బ్యాంకును విడివిడిగా సందర్శించాల్సిన అవసరం ఉండదు. మీరు కేవలం ఒకే చోట మీ సీకేవైసీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేస్తే చాలు, అది అనుసంధానించి అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో స్వయంచాలకంగా అప్‌డేట్ అవుతుంది.

దీని ప్రయోజనాలు:

సీకేవైసీ మిమ్మల్ని పత్రాలను మళ్లీ మళ్లీ సమర్పించే శ్రమ నుండి విముక్తి చేస్తుంది. మీరు పదేపదే ఫోటోకాపీలు తీయడం, ఫారమ్‌లు నింపడం, భౌతిక ధృవీకరణకు లోనవడం వంటివి చేయనవసరం లేదు. సంస్థలు సిద్ధంగా ఉన్న ధృవీకరణ డేటాను అందుకుంటాయి. దీనివల్ల కొత్త ఖాతా తెరిచేటప్పుడు లేదా రుణం ఆమోదించేటప్పుడు మీ సమయం ఆదా అవుతుంది. మీ పత్రాలు ఒక కేంద్ర, సురక్షితమైన సర్వర్‌లో డిజిటల్‌గా నిల్వ అవుతాయి. తద్వారా దుర్వినియోగ ప్రమాదం తొలగిపోతుంది.

CKYC నంబర్ ఎక్కడ పొందాలి?

  • వినియోగదారులు తమ CKYC నంబర్‌ను సులభంగా పొందవచ్చని ఆర్‌బిఐ పేర్కొంది. ఈ నంబర్‌ను పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
  • మీ బ్యాంకును సంప్రదించండి: మీరు ఖాతా తెరిచిన బ్యాంకు నుండే CKYC నంబర్‌ను పొందవచ్చు.
  • మిస్డ్ కాల్: మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఇంటి నుండే మీ CKYC నంబర్‌ను పొందవచ్చు. మీరు 7799022129 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
  • ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా: మీరు CKYC పోర్టల్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇందుకోసం మీరు అధికారిక వెబ్‌సైట్ https://ckycindia.in ను సందర్శించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషీన్ వాడుతున్నారా? ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలో తెలుసా?. ఇలా చేస్తే నష్టాలే..!

ఇది కూడా చదవండి: Vande Bharat: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఈ రూట్లలో రెండు కొత్త వందే భారత్‌స్లీపర్‌ రైళ్లు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
బంపరాఫర్.. రూ.11కే సల్మాన్ కొత్త సినిమా టికెట్.. పూర్తి వివరాలివే
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
కాళీమాతను అమావాస్య రోజే ఎందుకు పూజిస్తారు? అర్ధరాత్రి ఆరాధన..
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
క్యాన్సర్ కణితి కాదు.. పంటి ముక్క! అరుదైన కేసులో షాకింగ్ ట్విస్ట్
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. కొత్త పోర్టల్..
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
అప్పుడే OTTలో శ్రీదేవి కొత్త సినిమా.. జెన్‌జీకి తెగ నచ్చేసిన మూవీ
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు..!
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
రూరలైనా.. అర్బనైనా.. వార్ మాత్రం వన్‌సైడేనా..
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
మీ పిల్లలు తెలివైన వారో కాదో ఎలా తెలుసుకోవాలో తెలుసా?
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
దీపావళి రోజున కేదారేశ్వర వ్రతం ఇలా చేస్తే శుభప్రదం.. సౌభాగ్యం..
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!
వాస్తు టిప్స్ : దీపావళికి అస్సలే ఇవ్వకూడని బహుమతులు ఇవే!