AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు.. అసలేం జరిగిందంటే..?

ఓ గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ ఇద్దరిలో ఒకరు అమ్మాయి కాగా.. మరొకరు అబ్బాయి. ఆత్మహత్యలుగా కనిపిస్తున్న ఈ ఘటనలు.. ఒకవైపు హత్య ఆరోపణలు.. మరోవైపు రక్తంతో రాసిన సందేశం.. ఇవన్నీ కలిసి డబుల్ డెత్ మిస్టరీగా మారాయి. ఈ మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు పడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు.. అసలేం జరిగిందంటే..?
Nalgonda Double Death Mystery
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 18, 2026 | 3:56 PM

Share

మొదట సాధారణ అనుమానాస్పద మరణాలుగా కనిపించిన ఆ రెండు ఘటనలు.. ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠ రేపుతున్నాయి. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్లకు చెందిన లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఇదే గ్రామానికి చెందిన చరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీ ప్రసన్న మృతి విషయం తెలుసుకున్న చరణ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. రాత్రి గ్రామ శివారులోని తాటి చెట్టుకు ఉరివేసుకుని అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రెండు ఇళ్లలో ఒకే రాత్రి విషాదం నెలకొంది.

లక్ష్మీ ప్రసన్న కుటుంబం చేసిన ఆరోపణలతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కాదని.. గ్రామానికి చెందిన చరణే హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు చరణ్ చేసిన పని ఇప్పుడు కేసులో మరింత ఉత్కంఠ పెంచుతుంది. తన తండ్రి సమాధిపై స్వయంగా రక్తంతో కొన్ని పేర్లు రాశాడు. దీంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. మొదట ఆత్మహత్యగా కనిపించిన ఘటనలో ఇతర కోణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. చరణ్ వేధింపుల వల్లే లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ డబుల్ సూసైడ్ ఘటనపై మొబైల్ ఫోన్లు, కాల్ డేటా, చాటింగ్ వివరాలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తున్నామని ఎస్సై రవీందర్ చెబుతున్నారు.

Follow Us
ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు
ఇంట్లో అమ్మాయి.. చెట్టుకు అబ్బాయి.. తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు
చాణక్య నీతి : కోట్లు ఇచ్చినా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకండి
చాణక్య నీతి : కోట్లు ఇచ్చినా ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోకండి
వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? లాభ, నష్టాలు తెలుసుకోండి
వాస్తు టిప్స్ : ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? లాభ, నష్టాలు తెలుసుకోండి
50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో తండ్రి కన్నీళ్లు
50 ఏళ్ల నాన్నకు కూతురు డ్రీమ్ గిఫ్ట్.. ఆనందంతో తండ్రి కన్నీళ్లు
సీక్రెట్ చిట్కాలతో పురానీ ఢిల్లీ స్పెషల్ 'మటన్ పాయా'..
సీక్రెట్ చిట్కాలతో పురానీ ఢిల్లీ స్పెషల్ 'మటన్ పాయా'..
గుడ్లు, పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. సూపర్ ఫుడ్ ఇదే
గుడ్లు, పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. సూపర్ ఫుడ్ ఇదే
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్న సినిమా..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
చాతుర్మాసంలో కొత్త ఇల్లు కొనొచ్చా? గృహప్రవేశం చేయవచ్చా?..
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
రాశ్యాధిపతి బలంతో వారి జాతకం మారబోతోంది.. ఇక పట్టిందల్లా బంగారమే!
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..
వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే..