Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..!
మహారాష్ట్రలోని డోంబివ్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం (జూలై 18) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టికెట్ కౌంటర్‌లోని టికెట్ విండో ముందు ఓ నాగుపాము పడగ విప్పి కూర్చోని కనిపించింది. దాన్ని చూసిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టికెట్ తీసుకునేందుకు వచ్చిన వారు పామును చూసి వెనక్కి పరుగులు తీయడంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే టికెట్ కౌంటర్ పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయించి ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం పాములను పట్టుకునే నిపుణులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాగుపామును ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
ఈ ఘటన కారణంగా కొంతసేపు టికెట్ల జారీకి అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
నాగుపాము షాకింగ్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…