AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కారు మైలేజ్ పెంచే సింపుల్ ట్రిక్స్.. ఇలా నడిపితే మస్త్ పైసలు ఆదా..

మీ కారు మైలేజ్ ఇవ్వట్లేదా..? అయితే మీరు డ్రైవింగ్ చేసే పద్ధతి మార్చాల్సిందే.. కారు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లడం అనేది కేవలం ఇంజిన్ సామర్థ్యం పైనే కాదు, మనం నడిపే వేగం పైన కూడా ఆధారపడి ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. మీ కారు మైలేజీని అమాంతం పెంచే ఆ సింపుల్ ట్రిక్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మీ కారు మైలేజ్ పెంచే సింపుల్ ట్రిక్స్.. ఇలా నడిపితే మస్త్ పైసలు ఆదా..
How To Increase Car Mileage
Krishna S
|

Updated on: Jul 18, 2026 | 6:57 PM

Share

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడిపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుంది. ఈ తరుణంలో కారు కొనేవారైనా, వాడుతున్నవారైనా అందరూ చూసేది ఒకటే.. మంచి మైలేజీ. అయితే కారు మంచి మైలేజ్ ఇవ్వడం అనేది కేవలం ఆ కారు ఇంజిన్‌ సామర్థ్యంపై మాత్రమే ఆధారపడి ఉండదు. మనం కారును నడిపే విధానం కూడా ఇంధన వినియోగాన్ని భారీగా ప్రభావితం చేస్తుందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. సరైన వేగాన్ని పాటించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు ఇంజిన్ జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు.

హైవేలపై మైలేజీని పెంచుకోవడం ఎలా?

మీరు తరచుగా లాంగ్ డ్రైవ్‌లు లేదా హైవేలపై ప్రయాణించేవారైతే, కారు వేగాన్ని స్థిరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలా కార్లు గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు అత్యుత్తమ మైలేజీని ఇస్తాయి. ఈ వేగ పరిమితిలో ఇంజిన్ టాప్ గేర్లలో చాలా సజావుగా నడుస్తుంది. దీనివల్ల ఇంధనం తక్కువగా ఖర్చవుతుంది. హైవేలపై అనవసరంగా వేగాన్ని పెంచడం, పదే పదే బ్రేకులు వేయడం వంటివి అస్సలు చేయకూడదు.

సిటీ ట్రాఫిక్‌లో ఈ వేగం బెస్ట్..

నగర రహదారులపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల పదే పదే గేర్లు మార్చడం, బ్రేకులు వేయడం సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితుల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం ఉత్తమం. ట్రాఫిక్‌ను ముందుగానే గమనిస్తూ, అకస్మాత్తుగా బ్రేకులు వేయకుండా కారును సాఫీగా ముందుకు తీసుకెళ్లడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి మైలేజ్ మెరుగుపడుతుంది.

అధిక వేగం… జేబుకు చిల్లు..

రోడ్డు ఖాళీగా ఉందని చాలా మంది వేగాన్ని గంటకు 100 లేదా 120 కిలోమీటర్లకు పెంచుతుంటారు. అయితే వేగం పెరిగే కొద్దీ కారుపై గాలి నిరోధకత కూడా పెరుగుతుంది. ఈ నిరోధకతను అధిగమించి కారు ముందుకు దూసుకెళ్లడానికి ఇంజిన్ ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది, ఫలితంగా ఇంధనం విపరీతంగా నష్టపోతుంది. కారు వేగం గంటకు 90 కిలోమీటర్లు దాటినప్పటి నుండి మైలేజ్ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. కారును గంటకు 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో నడపడం వల్ల ఇంధన వినియోగం సుమారు 15 నుండి 20 శాతం వరకు పెరుగుతుంది.

మెరుగైన మైలేజీ కోసం సులభమైన చిట్కాలు..

మీ కారు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి..

రెగ్యులర్ సర్వీసింగ్: కారును సమయానికి సర్వీసింగ్ చేయించడం వల్ల ఇంజిన్ పనితీరు బాగుంటుంది.

టైర్ ప్రెజర్: టైర్లలో కంపెనీ సూచించిన మేర సరైన గాలి పీడనాన్ని మెయింటైన్ చేయాలి. గాలి తక్కువగా ఉంటే మైలేజ్ తగ్గుతుంది.

అదనపు బరువు వద్దు: కారులో అనవసరమైన బరువైన వస్తువులను ఉంచడం వల్ల ఇంజిన్‌పై భారం పడుతుంది.

ఇంజిన్ ఆఫ్ చేయండి: ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా ఎవరి కోసమైనా ఎక్కువ సమయం వేచి ఉన్నప్పుడు కారు ఇంజిన్‌ను ఆపివేయడం మంచి అలవాటు.

కారును సరైన పద్ధతిలో, స్థిరమైన వేగంతో నడపడం కేవలం ఇంధనాన్ని ఆదా చేయడమే కాదు.. మీ ప్రయాణాన్ని సురక్షితం చేస్తుంది. కారు ఇంజిన్ ఆయుష్షును పెంచుతుంది. మీ జేబుకు కూడా ఉపశమనాన్ని ఇస్తుంది.

Follow Us
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
గోధుమ పిండితో ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ వెజ్ ప్యాకెట్స్..
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు