Hyderabad: కేబీఆర్ పార్కులో 12 అడుగుల పైథాన్.. పామును చూసి ఉలిక్కిపడ్డ వాకర్స్!
హైదరాబాద్ నగర నడిబొడ్డున శనివారం (జూలై 18) ఉదయం భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. బంజారాహిల్స్ ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) జాతీయ పార్కులో వాకర్స్ కంట పడ్డ ఫైథాన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయపు వాకింగ్‌కు వచ్చిన వారు సుమారు 12 అడుగుల పొడవున్న పైథాన్ పార్కులోని నడక మార్గాన్ని నెమ్మదిగా దాటుతుండటం చూసి కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువ భారీ పరిమాణం కారణంగా దారిని పూర్తిగా దాటేందుకు కొంత సమయం పట్టింది.

ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడున్న పలువురు సందర్శకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కొండచిలువ కనిపించడంతో వాకర్లు కొంతసేపు అప్రమత్తంగా ఉండగా, అనంతరం అది ఎలాంటి హాని చేయకుండా సహజంగానే పార్కులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని సమాచారం.
నగరం మధ్యలో ఉన్న కేబీఆర్ జాతీయ పార్కు అనేక రకాల పక్షులు, అడవి జంతువులు, సరీసృపాలకు సహజ ఆవాసంగా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఆహారం కోసం ఇలాంటి వన్యప్రాణులు అప్పుడప్పుడు నడక మార్గాల వద్దకు రావడం సాధారణం. ఈ ఘటన మరోసారి కేబీఆర్ పార్కులోని జీవవైవిధ్యాన్ని గుర్తు చేసింది. అడవి జంతువులు లేదా సరీసృపాలు కనిపించినప్పుడు వాటికి దూరంగా ఉండాలని, ఫోటోలు లేదా వీడియోల కోసం దగ్గరకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని నిపుణులు ప్రజలకు కోరుతున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫైథాన్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..