ఆ దేశంలో డ్రైవర్లు, డెలివరీబాయ్స్ కు ఉచిత కరోనా టెస్టులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి అనేక దేశాలు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాయి. అటు సింగపూర్ దేశంలో కరోనా టెస్టుల్లో వేగం పెంచింది. ఆ దేశంలో కొందరికి ఉచితంగా కరోనా టెస్టుల నిర్వహించాలని నిర్ణయించింది. ట్యాక్సీ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ వర్కర్లు, హాకర్లకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సింగపూర్ నిర్ణయించినట్టు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది

ఆ దేశంలో డ్రైవర్లు, డెలివరీబాయ్స్ కు ఉచిత కరోనా టెస్టులు
Follow us

|

Updated on: Aug 30, 2020 | 7:32 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి అనేక దేశాలు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాయి. అటు సింగపూర్ దేశంలో కరోనా టెస్టుల్లో వేగం పెంచింది. ఆ దేశంలో కొందరికి ఉచితంగా కరోనా టెస్టుల నిర్వహించాలని నిర్ణయించింది. ట్యాక్సీ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ వర్కర్లు, హాకర్లకు కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని సింగపూర్ నిర్ణయించినట్టు హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. వీరికి కరోనా సోకే అవకాశం ఉన్నట్టు ‘స్థానిక ఆధారాలు’ లేనప్పటికీ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వారి పని వాతావరణం స్వభావాన్ని బట్టి ప్రజలను నిత్యం కలుసుకునే అవకాశం ఉండడంతో వారికి పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఇందుకయ్యే పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన వివరించింది.

మరోవైపు సింగపూర్ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా ఆదివారం 54 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 కమ్యూనిటీవి కాగా, ఏడు ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుంచి నమోదైన కేసులని ప్రభుత్వం తెలిపింది. మిగతావి వలస కార్మికులవని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు 56,771 కరోనా కేసులు నిర్ధారణ అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మరో 110 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 55,447కు పెరిగింది. ప్రభుత్వ ఉచిత పరీక్షల నిర్ణయం పట్ల ట్యాక్సీ డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేశారు.