భర్త పేరుతో పాస్ పోర్ట్ తీసి ప్రియుడ్ని ఆస్టేలియా తీసుకెళ్లింది

ప్రియుడ్ని ఆస్ట్రేలియా తీసుకెళ్లి ఎంజాయ్ చేయాలన్న తన కలను చాకచక్యంగా తీర్చుకుంది ఓ ఇల్లాలు. అదీ భర్త పేరిట పాస్ పోర్ట్ తీసుకొనిమరీ.. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ లో...

భర్త పేరుతో పాస్ పోర్ట్ తీసి ప్రియుడ్ని ఆస్టేలియా తీసుకెళ్లింది
Pardhasaradhi Peri

|

Aug 30, 2020 | 7:05 PM

ప్రియుడ్ని ఆస్ట్రేలియా తీసుకెళ్లి ఎంజాయ్ చేయాలన్న తన కలను చాకచక్యంగా తీర్చుకుంది ఓ ఇల్లాలు. అదీ భర్త పేరిట పాస్ పోర్ట్ తీసుకొనిమరీ.. ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ లో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే భర్త (45) ముంబైలో ఉద్యోగం చేస్తూ.. సొంత ఊర్లోని ఫాంహౌస్ చూసుకుంటోన్న భార్య(35) దగ్గరకి అడపాతడపా వచ్చేవాడు. వీరి పిల్లల్లో ఒకరు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నాడు. ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియా అందాలు ఆస్వాదించాలని కొంతకాలంగా భావిస్తోన్న ఆ భార్య ప్రియుడిని ఉంచి తన భర్త పేరిట చాకచక్యంగా పాస్ పోర్ట్ తీసుకుంది. జనవరి 6న తన ప్రియుడు సందీప్ సింగ్ తో కలిసి ఆస్ట్రేలియా చెక్కేసింది. అయితే, వాళ్లు మార్చిలో భారత్ తిరిగి రావాల్సి ఉండగా, కరోనా ఎఫెక్ట్ తో ఆస్ట్రేలియాలోనే చిక్కుకుపోయారు. చివరికి వందేభారత్ మిషన్ లో ఆగస్టు 24న ఇండియా వచ్చారు.

అయితే, ఇటీవల స్వగ్రామానికి వచ్చిన భర్తకు భార్య ప్రియుడు సందీప్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లినట్టు తెలిసింది. తన పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లతో తన భార్య ప్రియుడు పాస్ పోర్టు పొందాడేమోనన్న సందేహంతో ఉద్దేశపూర్వకంగా పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు బాధిత భర్త. అయితే అప్పటికే అతడి పేరు మీద ఓ పాస్ పోర్టు ఉందని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదీ.. సంగతి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu