రాజస్థాన్‌ రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్‌కు కరోనా

వైరస్ బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా ఎక్కువుతూనే ఉంది. రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్‌కు కరోనా సోకింది. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, దీంతో పాజిటివ్‌గా ఆదివారం నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు.

రాజస్థాన్‌ రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్‌కు కరోనా
Balu

|

Aug 30, 2020 | 6:59 PM

కరోనా ఉగ్రరూపానికి జనం విలవిలలాడుతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా కొవిడ్ ధాటికి గురువుతున్నారు. రాజస్థాన్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 78,77కు చేరగా వెయ్యి మందికిపైగా మరణించారు. ఇప్పటి వరకు 62,971 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా క్రమంగా ఎక్కువుతూనే ఉంది. రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్‌కు కరోనా సోకింది. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, దీంతో పాజిటివ్‌గా ఆదివారం నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని, ‌ఐసొలేషన్‌లో ఉండాలని ప్రతాప్ సింగ్ సూచించారు. కరోనా పట్ల అందరూ జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu