డిజిటల్‌ మీటర్లపై అపోహలు వద్దు..

ఉచిత విద్యుత్ నగదు బదిలీపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. మీటర్లకు సంబంధించి రైతులపై ఎలాంటి భారం పడదని ఆయన స్పష్టం చేశారు...

డిజిటల్‌ మీటర్లపై అపోహలు వద్దు..
Follow us

|

Updated on: Sep 08, 2020 | 7:31 AM

digital meters : ఉచిత విద్యుత్ నగదు బదిలీపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. మీటర్లకు సంబంధించి రైతులపై ఎలాంటి భారం పడదని ఆయన స్పష్టం చేశారు. మీటర్లలో ఏ సమస్యలు తలెత్తినా విద్యుత్ సంస్థలే మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేస్తాయని అన్నారు.

మీటర్లు అపహరణకు గురైతే రైతు సంబంధిత డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీల అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. దీనిపై సంబంధిత డిస్కంల అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు రైతు నుంచి ఎలాంటి ఫీజు తీసుకోరని శ్రీకాంత్‌ తెలిపారు.

రీడింగ్ రికార్డింగ్‌కు సంబంధించి డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. సిబ్బందితో పాటు స్పాట్‌ బిల్లింగ్‌ ఏజెన్సీల ద్వారా రికార్డింగ్‌లు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. స్మార్ట్‌ మీటర్లను సాధ్యమైనంతవరకు బిగించాలని ప్రతిపాదించామని, దీనికి సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తదని సీఎండీ అభిప్రాయపడ్డారు.