టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ రచయిత కన్నుమూత..

టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ రచయిత కన్నుమూత..

సుప్రసిద్ధ సినీ, నవలా, నాటక రచయిత శ్రీ సి.ఎస్.రావు (85) నేడు హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు చిత్రం ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో సినిమాలకు ఆయన కథలు అందించారు. ఎన్‌టీఆర్‌ సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సొమ్మొకడిది సోకొకడిది’ వంటి చిత్రాల్లో సి.ఎస్.రావు నటించారు. నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. […]

Ravi Kiran

|

Apr 14, 2020 | 6:59 PM

సుప్రసిద్ధ సినీ, నవలా, నాటక రచయిత శ్రీ సి.ఎస్.రావు (85) నేడు హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, జాతీయ అవార్డు చిత్రం ఊరుమ్మడి బతుకులు, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు వంటి ఎన్నో సినిమాలకు ఆయన కథలు అందించారు.

ఎన్‌టీఆర్‌ సరదా రాముడు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సొమ్మొకడిది సోకొకడిది’ వంటి చిత్రాల్లో సి.ఎస్.రావు నటించారు. నాటక రంగానికి విశేషమైన సేవ చేసి ఎన్నో అవార్డులని సైతం గెలుచుకున్నారు. ఎందరో నటీనటులకి ఆచార్యులుగా కూడా వ్యవహరించారు. వీరు ప్రస్తుతం చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

శ్రీ సి.ఎస్.రావుకి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సింగపూర్‌లో ఉండడం వల్ల రాలేని పరిస్థితి. లాక్ డౌన్ నిబంధనలు గౌరవించి ఎవ్వరూ పరామర్శకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయత్నం చేయవద్దని కుటుంబ సభ్యులు సినీపరిశ్రమ మిత్రులని, శ్రేయోభిలాషులని కోరారు. బుధవారం హైదరాబాదులోనే అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇవి చదవండి:

జగన్ సర్కార్ సంచలనం.. బ్లడ్ డొనేషన్ క్యాంపులపై నిషేధం..

Flash News: మే 3 వరకు ఐపీఎల్ వాయిదా.. సౌరవ్ గంగూలీ ప్రకటన..

లాక్ డౌన్ అమలులో విజయవంతం.. ఏపీ అగ్రస్థానం.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu