వాహనదారులకు కేంద్రం డబుల్ షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

Central Government: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.  దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 మేరకు తగ్గించిన కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .2 నుండి […]

  • Updated On - 2:13 pm, Sat, 14 March 20
వాహనదారులకు కేంద్రం డబుల్ షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

Central Government: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిపెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.  దీని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 మేరకు తగ్గించిన కొద్దిరోజులకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ .2 నుండి రూ .8, డీజిల్‌కు రూ .4 మేరకు పెంచారు. అటు పెట్రోల్‌పై రోడ్‌సెస్‌ను లీటరుకు రూ .1, డీజిల్‌కు రూ .10గా నిర్ణయించారు.

కాగా, మార్చి 11 న పెట్రోల్ ధరను రూ. 2.69 మేరకు తగ్గించగా.. డీజిల్ ధరలను రూ .2.33కు తగ్గించారు. మరోవైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి భారీగా పడిపోయాయి. ప్రపంచదేశాలన్ని కరోనా వైరస్ వణికిపోతున్న నేపథ్యంలో మార్కెట్ అంతటా పతనం అవుతోంది. ఇక సోమవారం పెట్రోల్ ధరలు దాదాపు ఎనిమిది నెలల తర్వాత రూ.71 కిందకు పడిపోయాయి. అటు అంతర్జాతీయ చమురు ధరలు కూడా 31 శాతానికి పడిపోవడం జరిగింది.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?