శివరాత్రి ఉపవాసాన్ని ఈ విధంగా కొనసాగించండి.. ఆకలనేది ఇట్టే మరిచిపోతారు..
మహా శివరాత్రి రోజు.. ఆ పరమశివుడికి ఉపవాసం, జాగరణ ఉండటం అనాధిగా వస్తున్నసంప్రదాయం. భక్తులు కోరిన కోర్కెలను తీర్చే ఆ పరమశివుడిని.. ఈ పర్వదినాన.. మనసారా పూజించి, ఏ కోరికలను కోరినా ప్రసాదిస్తాడని నమ్మకం. అభిషేక ప్రియుడైన శివుడికి.. పూలు, పత్రం, నీరు ఇలా దేనిని సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలా మంది భక్తులు.. ఆ మహాశివుడికి ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ.. ఉపవాసాలు, జాగరం చేస్తారు. రోజంతా శివనామస్మరణ చేస్తూ.. […]

మహా శివరాత్రి రోజు.. ఆ పరమశివుడికి ఉపవాసం, జాగరణ ఉండటం అనాధిగా వస్తున్నసంప్రదాయం. భక్తులు కోరిన కోర్కెలను తీర్చే ఆ పరమశివుడిని.. ఈ పర్వదినాన.. మనసారా పూజించి, ఏ కోరికలను కోరినా ప్రసాదిస్తాడని నమ్మకం. అభిషేక ప్రియుడైన శివుడికి.. పూలు, పత్రం, నీరు ఇలా దేనిని సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలా మంది భక్తులు.. ఆ మహాశివుడికి ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ.. ఉపవాసాలు, జాగరం చేస్తారు.
రోజంతా శివనామస్మరణ చేస్తూ.. భక్తిశ్రద్ధలతో ఆ మహేశ్వరుడిని కొలుస్తారు. అయితే ఉపవాసం ఉండే వారు.. కొంతమంది ఆకలిని తట్టుకోలేరు. దీంతో ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా.. అని ఉదయం ఆలస్యంగా లేవడం అలవాటు. అయితే ఇది సరైంది కాదు. ఇలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. తల స్నానం చేసి శివదర్శనం చేసుకొవాలి. ఆ తర్వాత శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. అనంతరం సాయంత్రం.. ఆ పరమశివుడిని దర్శించుకుని ఉపవాసం వదలాలి. ఇక జాగారం ఉండేవారు.. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి. ఇలా చేసే సమయంలో పూజా విధానం, మంత్రాలు తెలియక పోయినప్పటికీ బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు.. శివానుగ్రహం లభిస్తుందని పురణాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకలసంపదలు కల్గుతాయని నమ్మకం. ఈ పర్వదినాన శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపంతో జాగరణ చేస్తే.. మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది.
ఆకలిని జయించడం ఎలా..?
ఈ పర్వదినాన ఉపవాసం చేస్తున్న సమయంలో కొన్ని గంటలపాటు ఆహారానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రతి రోజు సమయానికి తినే అలావాటు ఉన్నవారికి ఇది కాస్త కష్టమైందే. కానీ శివరాత్రి రోజు ఉపవాసం చేయాలనుకునే వారు.. కొన్ని చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఆకలి అనే విషయాన్ని మర్చిపోవచ్చు.
* మనస్సును తిండిపైకి వెళ్లకుండా.. ఎదో ఓ పని కల్పించుకోవాలి. * శరీరం అలసిపోయేలా కాకుండా.. చిన్ని చిన్న తేలికపాటి పనులను మాత్రమే చేయాలి. * స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి.. ముచ్చటిస్తుంటే.. చూస్తుండగానే సమయం గడిచిపోతుంది. * ఉపవాసం ఉన్నవారు ద్రవ పదార్థాలు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి. * చిన్న పిల్లలు, వృద్ధులు శరీరం సహకరించే దాన్ని బట్టి ఉపవాసం ఉంటే మంచిది. * శివనామస్మరణ చేస్తూ.. ధ్యానం చేస్తే ఇంకా మంచిది.