AP ESI Scam: ఏపీ ఈఎస్‌ఐలో భారీ స్కామ్.. ఆ హెల్త్ సర్వీసుల పేరిట..!
AP ESI Scam: టెలి హెల్త్ సర్వీసెస్ అనేది కంపెనీ పేరు. ఈ కంపెనీ రెండు రకాల సర్వీసులను అందిస్తుంది. ఒకటేమో కాల్ సెంటర్. రెండోది ఈసీజీ సర్వీసెస్. ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. ఈఎస్ఐ పేషేంట్ కు డాక్టర్ కన్సల్టేషన్ ఓవర్ ఫోన్ ఇస్తాడు. రీఇంబర్స్‌మెంట్ బిల్లుల కాన్సప్ట్ మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. 12 లక్షల ఈఎస్‌ఐ పేషేంట్స్ కు ఒక కాల్ కు 1.80 పైసలు నెలకి ఇస్తారు. కాల్ చేసినా, చేయకపోయినా డబ్బులు ఇస్తారు. […]

AP ESI Scam: టెలి హెల్త్ సర్వీసెస్ అనేది కంపెనీ పేరు. ఈ కంపెనీ రెండు రకాల సర్వీసులను అందిస్తుంది. ఒకటేమో కాల్ సెంటర్. రెండోది ఈసీజీ సర్వీసెస్. ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. ఈఎస్ఐ పేషేంట్ కు డాక్టర్ కన్సల్టేషన్ ఓవర్ ఫోన్ ఇస్తాడు. రీఇంబర్స్‌మెంట్ బిల్లుల కాన్సప్ట్ మార్చేసి అవినీతికి పాల్పడ్డారు. 12 లక్షల ఈఎస్‌ఐ పేషేంట్స్ కు ఒక కాల్ కు 1.80 పైసలు నెలకి ఇస్తారు. కాల్ చేసినా, చేయకపోయినా డబ్బులు ఇస్తారు. ఇక ఈసీజీ సర్వీసెస్. అసలు ఎండీ కార్డియాలజిస్ట్ లు లేనేలేరు. ఎండీ కార్డియాలజిస్ట్ ల సర్వీసులు పేషేంట్ లకు అందుబాటులో లేవు. ఏపీలో వెలుగు చూసిన ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంపై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ అచ్చెన్నాయుడు స్పందించారు. అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించిన విధంగానే తాము వ్యవహరించామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే తాము కూడా వ్యవహరించామని అచ్చెన్నాయుడు తెలిపారు. తాను మంత్రిగా ఇచ్చిన లేఖలోనూ ఇదే విషయం ఉందని ఆయన గుర్తు చేశారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని ఆయన వ్యాఖ్యానించారు. తనకు డబ్బులు అవసరమైతే తెలిసిన వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని సూచించారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా.. ఏపీ ఈఎస్ఐలో చోటు చేసుకున్న భారీ కుంభకోణాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈ కుంభకోణంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పద్ధతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. టెలీ హెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడంలో అచ్చెన్నాయుడు ఒత్తిడి తెచ్చారని… నామినేషన్ల పద్ధతిలో కేటాయించాలని అచ్చెన్నాయుడు ఆదేశించారని రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
అయితే.. ఈఎస్‌ఐలో గత ఆరేళ్లలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని తేలింది. లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లు తీసుకుని ఆర్డర్లు ఇచ్చినట్టు అధికారులు గుర్తించారు. రేట్ కాంట్రాక్ట్‌లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు రూ. 51 కోట్ల చెల్లించిన తేలింది. ఈ మొత్తం వ్యవహారానికి ఈఎస్ఐ డైరెక్టర్లు రవికుమార్, రమేశ్, విజయ్‌ను బాధ్యులుగా గుర్తించారు. మందులు, పరికరాలను వాస్తవ ధరకంటే…136 శాతం అధికారంగా సంస్థలు టెండర్లలో చూపించాయి. లెజెండ్ ఎంటర్ ప్రైజెస్, ఓమ్మిమేడి ఎన్వెంటర్ ఫెర్ఫామెన్స్ సంస్థలకు డైరెక్టర్లు అక్రమంగా రూ. 85 కోట్లు చెల్లించినట్టు రిపోర్టులో ప్రస్తావించారు. స్కామ్‌లో ఈఎస్ఐ డైరెక్టర్లకు ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు సహకరించారని పేర్కొన్నారు.