AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శిఖర్‌ ధావన్‌ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా ఢిల్లీ

 రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతున్నది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 153 పరుగుల టార్గటె ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(54) హాఫ్ సెంచరీ  సాధించాడు...

శిఖర్‌ ధావన్‌ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా ఢిల్లీ
Sanjay Kasula
|

Updated on: Nov 02, 2020 | 10:35 PM

Share

Shikhar Dhawan Half Century :  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతున్నది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 153 పరుగుల టార్గటె ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(54) హాఫ్ సెంచరీ  సాధించాడు.

స్వల్ప స్కోరుకే ఓపెనర్‌ పృథ్వీ షా పెవిలియన్‌ చేరడంతో ధావన్‌, రహానె ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన 13వ ఓవర్లో ధావన్‌ ఔటయ్యాడు. సాధారణ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఎలాంటి తడబాటు లేకుండానే జోరుగా బ్యాటింగ్‌ చేస్తోంది. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ఒత్తిడి లేకుండా ఆడుతోంది. 13 ఓవర్లకు ఢిల్లీ 2 వికెట్లకు 109 పరుగులు చేసింది. రహానె(42), శ్రేయస్‌ అయ్యర్‌(1) క్రీజులో ఉన్నారు.