అగ్రరాజ్యంలో పోలింగ్‌ బెల్‌.. అధ్యక్షుడిని నిర్ణయించేది ఎవరో తెలుసా…?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపును నిర్ణయించేది అత్యధిక ఓట్లు కాదు. ఎలక్ట్రోరల్‌ ఓట్లలో మెజారిటీ. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఆయా రాష్ట్ర జనాభాను బట్టి ఎలక్ట్రోరల్‌ ఓట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు కలిపి.. 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా.. 270కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన వారే విజేత.

అగ్రరాజ్యంలో పోలింగ్‌ బెల్‌.. అధ్యక్షుడిని నిర్ణయించేది ఎవరో తెలుసా...?
Follow us

|

Updated on: Nov 02, 2020 | 10:25 PM

ఎందుకంటే కాబోయే అమెరికా అధ్యక్షుడికి ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చే శక్తి ఉంది. అందుకే, యూఎస్‌ ఎలక్షన్స్‌పై ప్రపంచానికి అంత ఆసక్తి.. నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఈ సారి నవంబర్‌ 3న జరగనున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన జో బైడెన్‌ ట్రంప్‌ను ఓడించి తీరుతానంటున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపును నిర్ణయించేది అత్యధిక ఓట్లు కాదు. ఎలక్ట్రోరల్‌ ఓట్లలో మెజారిటీ. ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఆయా రాష్ట్ర జనాభాను బట్టి ఎలక్ట్రోరల్‌ ఓట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాలకు కలిపి.. 538 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా.. 270కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన వారే విజేత.

ఒపీనియన్‌ పోల్స్‌లో ట్రంప్‌ కంటే బైడెనే ముందున్నాడు. కొవిడ్‌ ఎఫెక్ట్‌.. ట్రంప్‌ను వైట్‌హౌజ్‌ నుంచి తరిమేసేలా ఉంది. ఎన్నికల ముందు.. రోజుకు 90వేల వరకూ పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం.. దాదాపు వెయ్యి మంది దాకా ప్రాణాలు కోల్పోతుండటం.. ట్రంప్‌కు మైనస్‌గా మారే అవకాశముంది. కొవిడ్‌ అదుపుపై ప్రజాభిప్రాయంలో ట్రంప్‌ కంటే బైడెన్‌ వైపే 57శాతం మంది మొగ్గు చూపడం ఇందుకు నిదర్శనం.

విదేశీ విధానాల విషయంలోనూ 54శాతం మంది బైడెన్‌కు సపోర్ట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఒపీనియన్‌ పోల్స్‌ సగటు తీసుకుంటే బైడెన్‌కు 52శాతం.. ట్రంప్‌ వైపు 43 శాతం మంది మొగ్గు చూపారు. ఇద్దరి మధ్య 9శాతం తేడా ఉంది. ట్రంప్‌ మాటల్లో, ప్రకటనల్లో తాను ఓడిపోతానేమోననే అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నారు.

ఈసారి అమెరికా అధ్యక్షుడి గెలుపును ప్రభావితం చేసేది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగే. కరోనా కారణంగా ఇప్పటికే 9 కోట్ల మంది మెయిల్‌ ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ చేశారు. పోస్టల్‌ ఓట్లు వేసిన వారిలో డెమొక్రాటిక్‌ పార్టీ మద్దతుదారులే అధికం. ఇంకా 15 కోట్ల మందికి పైగా ఓటింగ్‌ చేయాల్సి ఉంది. ట్రంప్‌ పిలుపు మేరకు.. రిపబ్లికన్‌ పార్టీ సపోర్టర్స్‌ పోలింగ్‌ రోజే డైరెక్ట్‌గా ఓటు వేసుందుకు రెడీ అవుతున్నారు. పోస్టల్‌ ఓట్స్‌ అధికంగా పోల్‌ అవడంతో ఈ సారి ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే.. ఎవరు గెలుస్తారన్న విషయం.. ట్రెండ్స్‌ను బట్టి నెక్ట్స్‌ డే కల్లా తేలిపోనుంది.

పోస్టల్‌ బ్యాలెట్‌తో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ట్రంప్‌ పదే పదే ప్రస్తావిస్తున్నారు. తాను ఓడిపోతే న్యాయపోరాటానికి దిగుతానంటూ ఇప్పటికే ప్రకటించాడు. అదే జరిగితే.. రిజల్ట్స్‌ మరింత లేట్‌ అవ్వొచ్చు.

ఎన్నికలు నవంబర్‌ 3న జరిగినా.. గెలుపొందిన అభ్యర్థి.. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేది మాత్రం వచ్చే ఏడాడి జనవరి 20న. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్‌ బిల్డింగ్‌ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అప్పటి నుంచి నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచ రాజకీయాలను యూఎస్‌ ప్రెసిడెంట్‌ ప్రభావితం చేస్తాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..